spot_img
Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other show eliminations: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' షోలో అప్పుడే...

Mad For Each Other show eliminations: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షోలో అప్పుడే 4 ఎలిమినేషన్లు , 2 వైల్డ్ కార్డు ఎంట్రీలు.. పూర్తి వివరాలు ఇవే!

Mad For Each Other show eliminations: ఈనెల 15 వ తేదిన స్టార్ మా ఛానల్ లో ప్రారంభమైన బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్'(Mad For Each Other) కి ఆడియన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పెళ్ళైన పది జంటలను లోపలకు పంపి, వాళ్ళ మధ్య జరిగే సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ షో ని రన్ చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన ‘ట్రూత్ ఆర్ డేర్’ టాస్కు చాలా ఆసక్తిని కలిగించింది. జంటల మధ్య విబేధాలకు దారి తీసేలా చేసింది ఈ టాస్క్. నేడు జరగబోయే ఎపిసోడ్ లో మొట్టమొదటి ఫిజికల్ టాస్క్ మొదలు కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రోమోలను కూడా మీరు కాసేపటి క్రితమే చూసి ఉంటారు. బిగ్ బాస్ షో లో జరిగే టాస్కులకంటే ఇక్కడ జరిగే టాస్కులే కఠినంగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే , ఇప్పటికే ఈ షో నుండి నాలుగు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారట.

మొదటి వారం ఎలాంటి ఎలిమినేషన్ ఉండే అవకాశం లేదట. కానీ రెండవ వారం నుండి వరుసగా ఎలిమినేషన్స్ ఉంటాయట. ఈ ఎలిమినేషన్స్ జోడీలు సాధించిన లీడర్ బోర్డు మార్కులను బట్టి ఉంటుందని సమాచారం. ఈ షో నుండి ఎలిమినేట్ అయినా మొదటి జంట హరిత – హరీష్. బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన హరీష్, కేవలం నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఆయనకు వచ్చిన రెండవ అద్భుతమైన అవకాశం. గడిచిన మూడు ఎపిసోడ్స్ చూస్తుంటే , కెమెరాల కోసం ఈయన చేస్తున్న ఓవర్ యాక్షన్ ని చూసి, ఇతను ఎలిమినేట్ అవ్వడమే కరెక్ట్ అని నెటిజెన్స్ అంటున్నారు. ఇక వీళ్ళ తర్వాత ఎలిమినేట్ అయిన రెండా జంట మహేష్ బాబు – సాండ్రా . గడిచిన మూడు ఎపిసోడ్స్ చూస్తుంటే మహేష్ బాబు చాలా అమాయకుడిగా, సాండ్రా గయ్యాలి గా అనిపించారు.

ఈ జంట ఎలిమినేట్ అవ్వడానికి కచ్చితంగా సాండ్రా నే కారణం అయ్యుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఇక వీళ్ళ తర్వాత ఎలిమినేట్ అయిన మూడవ జంట సంధ్య , బ్రిట్టూ. గడిచిన మూడు ఎపిసోడ్స్ చూస్తుంటే వీళ్లకు అసలు తెలుగు రాదు, టాస్కులు అర్థం కావడం లేదని తెలుస్తోంది . కాబట్టి వీళ్ళు ఎలిమినేట్ అవ్వడంతో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇక నాల్గవ ఎలిమినేషన్ మాత్రం ఎవ్వరూ ఊహించనిది. వాళ్లెవరో కాదు ప్రియాంక జైన్ – శివ. వీరిలో శివ కి కాలికి గాయం అవ్వడం వాళ్ళ స్వచ్ఛందంగా వీళ్ళే గేమ్ నుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇది కాసేపు పక్కన పెడితే, మహేష్ బాబు – సాండ్రా జంట మరోసారి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చినట్టు . వీళ్ళతో పాటు ఒక యోగా జంట కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Oktelugu Epaper
Exit mobile version