Mad For Each Other Show: ఈమధ్య కాలం లో స్టార్ మా ఛానల్ లో మొదలైన బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో మొదట్లో కాస్త నెగెటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది కానీ, మధ్యలో షో కాస్త ఆసక్తికరంగా మారడంతో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోయింది. కానీ గత రెండు వారాలుగా జరిగిన అన్యాయమైన ఎలిమినేషన్స్ కారణంగా ఈ షో పీక్ నెగెటివిటీ ని సొంతం చేసుకుంది. రియాలిటీ షో అని అంటూ ఉన్నారు కానీ , ఇది స్క్రిప్టెడ్ షో, వాళ్లకు నచ్చిన జంటను మ్యాన్షన్ లో పెట్టుకున్నారు , అవసరం లేని వాళ్ళను తొలగిస్తున్నారు అనే భావన చూసే ఆడియన్స్ లో కలిగింది. పైగా ఇప్పుడు ప్రసారం అవుతున్న ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎప్పుడో షూట్ చేసేశారు. అయినప్పటికీ మొన్నటి నుండి ఆడియన్స్ ఓటింగ్ ని ప్రవేశ పెట్టారు.
ఇప్పుడు మ్యాన్షన్ లో ఉన్న జంటలన్నీ ఓటింగ్ లైన్ లో ఉన్నారు. కానీ మనం ఓట్లు వేసి వృధా. ఎందుకంటే ఇప్పటికే ఎలిమినేషన్స్ జరిగిపోయాయి. ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయే జంట మరెవరో కాదు , ప్రియాంక – శివ్ జంటనే. ఎందుకంటే శివ్ కళ్ళకు మూడవ వారం లో దెబ్బ తగలడం , ఆ దెబ్బ కారణంగా ఆయన గేమ్స్ ఆడలేకపోతుండడం తో ఈ షో నుండి వైదొలగినట్టు సమాచారం. అదే విధంగా వచ్చే వారం వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇచ్చిన అమీర్ – అభిమానిక జంట ఎలిమినేట్ అవ్వబోతుంది , 6 వ వారం లో అంజలి – పవన్ జంట, 7 వ వారం లో సిద్దు – సోనియా జంట ఎలిమినేట్ అవ్వబోతుంది. ఇప్పటికే షూటింగ్ జరిగిపోయి , ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ని కూడా ఓటింగ్ లో ఉంచడం వెనుక కారణం ఏంటి?, జనాలు మరీ అంత పిచ్చి వాళ్ళుగా కనిపిస్తున్నారా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆడియన్స్ ఓటింగ్ ద్వారా టాప్ 6 లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరో ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతారు. ఆడియన్స్ ఓటింగ్ అందరికంటే మొదటి స్థానం లో ఉన్న జంట ఏంటో తెలుసా?, 7 వ వారం లో ఎలిమినేట్ అవ్వబోయే సిద్దు – సోనియా జంట. అదే విధంగా రెండవ స్థానం లో పవన్ కళ్యాణ్ – వాసంతి జంట కొనసాగుతుండగా , 3 వ స్థానం లో ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయే ప్రియాంక – శివ్ జంట కొనసాగుతుంది. అదే విధంగా నాల్గవ స్థానంలో నూక రాజు , ఆసియా జంట కొనసాగుతుండగా , 5 వ స్థానం లో నటరాజ్ – నీతూ జంట, ఆరవ స్థానం లో జాను – భాను జంట కొనసాగుతోంది.