Shreya: గతేడాది తనకు బిడ్డ పుట్టిందని ఇటీవలె ప్రకటించిన హీరోయిన్ శ్రయసరన్.. ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. తనకు తొమ్మిది నెలల క్రితం ఆడపిల్ల పుట్టిందని, తనకు రాధ అని పేరు పెట్టినట్లు శ్రియ ప్రకటించింది. శ్రియ తల్లి కావడం అందరూ సంతోషించినప్పటికి.. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇటువంటి విషయాన్ని రహస్యంగా ఉంచడంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రియ ప్రెగ్నెన్సీ దాచడంపై మంచు లక్ష్మి ప్రసన్న ట్విట్టర్ వేదికగా స్పందించింది.

శ్రియ పోస్ట్‌కు ఆమె రీట్వీట్ చేస్తూ.. మంచి శుభవార్త అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ఆనందకరమైన మాతృత్వాన్ని అనుభవించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయమని.. నీకు దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది లక్ష్మి. కాగా, ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో జాప్యం చేయడం గర్వించతగ్గ విషయమని తెలిపింది. ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది వ్యక్తిగత విషయంమని పేర్కొంది.
2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్‌ను సీక్రెట్‌గా పెళ్లాడింది శ్రియ. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే. కాగా, శ్రియ తన కుమార్తెతో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయం దాచడంపై భిన్న అభిప్రాయాలు వస్తున్నప్పటికీ.. శ్రియ ఏ విధంగా స్పందించలేదు. ప్రస్తుతం కుటుంబంతో సరదగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు ఎప్పటికప్పుడూ తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారును కవ్విస్తుంటుంది శ్రియ. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి.