Macherla Niyojakavargam Collections: ఎం.ఎస్ రాజాశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సినిమా “మాచర్ల నియోజకవర్గం”. ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్‌లుగా నటించారు. అయితే, ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకీ ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి.
ముందుగా ఈ సినిమా 5 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: Dil Raju: హిట్ కోసం టాలీవుడ్ ను వదిలేసి తమిళులను నమ్ముకుంటున్న దిల్ రాజు
నైజాం 2.10 కోట్లు
సీడెడ్ 0.97 కోట్లు
ఉత్తరాంధ్ర 0.90 కోట్లు
ఈస్ట్ 0.60 కోట్లు
వెస్ట్ 0.27 కోట్లు
గుంటూరు 0.67 కోట్లు
కృష్ణా 0.43 కోట్లు
నెల్లూరు 0.37 కోట్లు
ఏపీ + తెలంగాణలో 5 రోజుల కలెక్షన్స్ గానూ రూ 6.40 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 12.80 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.38 కోట్లు
ఓవర్సీస్ 0.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 5 రోజుల కలెక్షన్స్ గానూ రూ:7.09 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 5 రోజుల కలెక్షన్స్ గానూ థాంక్యూ రూ. 13.74 కోట్లను కొల్లగొట్టింది
‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ. 7.09 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తానికి ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. నితిన్ కెరీర్ కి ఈ చిత్రం భారీ దెబ్బ కొట్టింది. మొత్తంగా డిజాస్టర్స్ లోనే ఇది భారీ డిజాస్టర్ గా నిలిచింది. పాపం ఈ సినిమాని నమ్ముకున్న నితిన్ నిండా మునిగిపోయాడు. కారణం మాత్రం దర్శకుడు ఎం.ఎస్ రాజాశేఖర్ రెడ్డినే.
Also Read:Heroine Priyamani Divorce: సమంత బాటలో ప్రియమణి.. సినీ ప్రముఖుల పెళ్లిళ్లు ఎందుకు నిలబడడం లేదు