అతను దర్శకుడిగా సక్సెస్ కాలేకపోయాడు. అయితేనేం కథకుడిగా, మాటల రచయితగా ఎప్పుడూ బిజినే.. కాకపోతే ఇంతవరకూ సరైన సినిమా పడలేదు అంతే. కానీ ఇండస్ట్రీలో మంచి రిలేషన్స్ ఉన్నాయి అతనికి. అందుకే ఎప్పటికప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉంటాడు. ఆయనే బివిఎస్ రవి. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు గానీ, మచ్చ రవి అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు అందరూ.
ఇక రవి స్క్రిప్ట్ తోనే డైరక్టర్ విక్రమ్ కుమార్ నాగ్ చైతన్యతో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. అలాగే మచ్చ రవి బాలయ్యకి కూడా కథ చెప్పి ఒప్పించాడు. ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా వుంటే బివిఎస్ రవి ప్రస్తుతం మూడు స్ట్రిప్ట్ లను రెడీ చేశారు. అది కూడా ఒటిటిల కోసమని. ఎలాగూ కరోనా సెకెండ్ వేవ్ తో సినిమాల పరిస్థితి బాగాలేదు కాబట్టి.. ఓటిటీల పై పడ్డారు సినీ జనం.
ఇక ఈ మూడు స్క్రిప్ట్స్ లో ఒక స్క్రిప్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మిడ్ నైట్ అనే పేరుతో రాబోతున్న ఆ వెబ్ సినిమాలో మాంచి యూత్ కంటెంట్ ను పెట్టారట. అన్నట్టు ఈ మిడ్ నైట్ మసాలా సినిమాలో హీరోగా రాజ్ తరుణ్ కనిపించబోతున్నాడు. ఇక మిగిలిన రెండు కథలలో కూడా ఇద్దరు యంగ్ హీరోలు కనిపిస్తారట.
ఈ రెండు కథలలో ఒకదాన్ని నిన్నటి తరం దర్శకుడు శివ నాగేశ్వరరావు డైరెక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ కథను పూర్తి స్క్రిప్ట్ గా తయారుచేసే పనిలో బిజీగా వున్నారు రవి టీమ్. అలాగే మరో కథతో డివివి దానయ్య కుమారుడిని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కథను మచ్చ రవి అసిస్టెంట్ డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.