https://oktelugu.com/

Harihara Veeramallu : వీరమల్లు వాయిస్ లో బేస్ బాక్సాఫీస్ ను షేక్ చేయబోతుందా..?

మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే...

Written By:
  • Gopi
  • , Updated On : January 14, 2025 / 04:25 PM IST

    Harihara Veeramallu movie

    Follow us on

    Harihara Veeramallu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో మన స్టార్ హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆయన ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ రోజుల్లోనే పవర్ స్టార్ గా అవతరించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన సినిమా కోసం యావత్ ప్రేక్షక లోకం మొత్తం ఎదురుచూస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నా కూడా మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచిన విషయం మనకు తెలిసిందే. అందులో ఏ ఏం రత్నం ప్రొడ్యూసర్ గా వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ఒకటి… అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని సినిమా యూనిట్ సంక్రాంతి కానుకగా ఈరోజు అనౌన్స్ చేశారు. అయితే ‘ మాట వినాలి’ అనే సాంగ్ ఇంతకు ముందే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేసినా కూడా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సాంగ్ ను జనవరి 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో ను ఈరోజు రిలీజ్ చేశారు.

    ఇక ఈ ప్రోమో లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘వినాలి వీరమల్లు మాట చెబితే వినాలి’ అంటూ ఒక డైలాగ్ అయితే హైలైట్ చేశారు. మొత్తానికైతే ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఈ డైలాగ్ విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు వీరమల్లు వాయిస్ లోని బేస్ చాలు బాక్సాఫీస్ బద్దలవ్వడానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు…

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఆయన ఏం చేసినా అదొక సెన్సేషన్ గా మిగిలిపోతుంది. కాబట్టి ఈ సినిమాతో కూడా ఆయన మరోసారి తన స్టార్ డమ్ ను రీచ్ అయ్యేవిధంగా భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడనే మాటలైతే వినిపిస్తున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.

    తద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడం తో ఈ సినిమాని ఏ ఏం రత్నం కొడుకు అయిన జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…