Maa Inti Bangaram OTT: సమంత ప్రధాన పాత్ర పోషిస్తూ , నిర్మాతగా వ్యవహరించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు గ్రాస్ వసూళ్లను రాబట్టి , లేడీ ఓరియెంటెడ్ చిత్రాల క్యాటగిరీలో , సౌత్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. కొత్తగా ఎన్ని సినిమాలు ఈమధ్య కాలం లో విడుదలైనప్పటికీ కూడా, ఈ సినిమా ఆడియన్స్ తగ్గలేదు. నిన్న కూడా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి 24 గంటల్లో 15 వేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడుపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది. మరో వారం రోజులు అద్భుతంగా థియేటర్స్ లో రన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కానీ మేకర్స్ ఓటీటీ సంస్థ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం , ఈ నెల 17 న స్ట్రీమింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ని జియో హాట్ స్టార్ సంస్థ మంచి ఫ్యాన్సీ ప్రైజ్ కి విడుదలకు ముందే కొనుగోలు చేశారు. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని 4 వారాలు తర్వాత ఓటీటీ లో విడుదల చెయ్యాలి. నాలుగు వారాలు పూర్తి అవ్వడం తో ఈ నెల 17 న ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు తో పాటు తమిళం , హిందీ , మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతుంది. థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకొని సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ చిత్రం , ఓటీటీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకోబోతుందో చూడాలి.
ఇకపోతే సౌత్ ఇండియా లో మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టిన లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ‘మా ఇంటి బంగారం’ చిత్రం నిల్చింది. లేడీ సూపర్ స్టార్స్ గా పిలవబడే అనుష్క , నయనతార వంటి వారికి కూడా ఈ ఘనత దక్కలేదు. ఇప్పుడు సమంత నయా లేడీ సూపర్ స్టార్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. రీ ఎంట్రీ లో ఆమె నటిగా మాత్రమే కాదు , నిర్మాతగా కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నిర్మాతగా ఆమె మొదటి చిత్రం ‘శుభమ్ ‘ పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత ‘ మా ఇంటి బంగారం’ చిత్రం పెట్టిన పెట్టుబడికి నాలుగింతల లాభాలను తెచ్చి పెట్టింది. భవిష్యత్తులో సమంత ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్ని చేస్తుందో చూడాలి.
