https://oktelugu.com/

MAA Elections:దొంగ ఓటు వివాదం.. కొట్టుకోబోయిన ప్రకాష్ రాజ్, నరేశ్

MAA Elections 2021 Live: ‘మా’ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూళ్లో మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరుగనున్నాయి. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటించనున్నారు. రాత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 10, 2021 / 01:50 PM IST
    Follow us on

    MAA Elections 2021 Live: ‘మా’ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూళ్లో మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

    ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరుగనున్నాయి. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటించనున్నారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

    ‘మా’ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్యానెల్ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు లోపలికి రావడంపై విష్ణు ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతరులు లోపలికి రావడంతో ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది. మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని విష్ను ప్యానెల్ అడ్డుకుంది. ప్రకాష్ రాజ్ గన్ మెన్లను కూడా పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని ఎన్నికల అధికారి తెలిపారు.

    తాజాగా పోలింగ్ కేంద్రం వద్ద ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్, ఎన్నికల్లో పోటీచేస్తోన్న ప్రకాష్ రాజ్ మధ్య వాగ్వాదం దృశ్యాలు సంచలనమయ్యాయి. దొంగ ఓటు ఆరోపణల నేపథ్యంలో పరిగెత్తుతోన్న ఓ వ్యక్తిని నటుడు నరేశ్ పట్టుకోవడానికి ప్రయత్నించడం.. అంతలోనే అటుగా వచ్చిన ప్రకాష్ రాజ్ ‘వాణ్ని కాదు.. నన్ను కొట్టండి.. నన్ను కొట్టు’ అంటూ నరేశ్ మీదకు ఉరకడం అక్కడున్న వాళ్లను షాక్ కు గురిచేసింది. దాదాపు నరేశ్-ప్రకాష్ రాజ్ కొట్టుకోవడానికి దగ్గర రావడం వీడియోల్లో రికార్డు అక్కడున్న వారు విడదీయడంతో ఈ గొడవ సద్దుమణిగింది.

    మాలో మాకు ఎలాంటి విభేదాలు లేవని.. అందరం కలిసే ఉంటామని ఓ వైపు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అంటున్నా.. లోపల మాత్రం సీన్ వేరేగా ఉంది.