https://oktelugu.com/

MAA Elections: ప్రకాష్ రాజ్ విందు రాజకీయాలపై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్

MAA Elections:‘మా’ ఎన్నికల వేడి మళ్లీ రాజుకుంది. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో విందు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఎవరికి వారు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాలు బలంగా పోటీపడుతున్నాయి. పాత అధ్యక్షుడు నరేశ్ వర్గం ‘మంచువిష్ణు’కు సపోర్టుగా నిలిచింది. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో సినీ కళాకారులకు పెద్ద ఎత్తున విందులు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 12, 2021 / 02:30 PM IST
    Follow us on

    MAA Elections:‘మా’ ఎన్నికల వేడి మళ్లీ రాజుకుంది. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో విందు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో ఎవరికి వారు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం ‘మా’ ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాలు బలంగా పోటీపడుతున్నాయి. పాత అధ్యక్షుడు నరేశ్ వర్గం ‘మంచువిష్ణు’కు సపోర్టుగా నిలిచింది. శని, ఆదివారాలు వీకెండ్ కావడంతో సినీ కళాకారులకు పెద్ద ఎత్తున విందులు ఇస్తున్నారు.

    టాలీవుడ్ లో విందు రాజకీయాలపై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. పోటీదారులందరూ తాము చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ‘మా’ సభ్యులకు ఫోన్ చేసి వివరించండి.. కానీ విందులు, పార్టీల పేరుతో వారిని ఒకే చోటకు చేర్చకండి అంటూ బండ్ల గణేష్ విజ్ఞప్తి చేశారు.

    ఈ ఏడాది జరుగనున్న ‘మా’ ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం పోటీచేసేందుకు సిద్ధమైన బండ్ల గణేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఎన్నికల వేళ ‘మా’లో విందు రాజకీయాలు జరుగుతున్నాయంటూ వస్తోన్న ప్రచారాలపై బండ్ల గణేష్ స్పందించారు. ‘విందులు, సన్మానాలు, పార్టీల పేరుతో ‘మా’ కళాకారులందరినీ దయచేసి దగ్గరకు చేర్చకండి. గత రెండేళ్ల నుంచి ప్రతి ఒక్కరూ కరోనా భయంతోనే బతుకుతున్నారు. మీకు ఓటు కావాలనుకుంటే ఫోన్ చేసి మీరు చేయాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్లకు చెప్పండి. వాళ్ల జీవితాలతో చెలగాటాలాడొద్దు. ఇదే నా విన్నపం’’ అని బండ్ల గణేష్ తెలిపారు.

    ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ‘మా’ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. వచ్చే నెలలో జరుగనున్న ‘మా’ ఎన్నికలకు తన ప్యానెల్ ప్రకటించిన ప్రకాష్ రాజ్.. విజయం సాధించేందుకు ఆదివారం కళాకారులందరికీ విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.