https://oktelugu.com/

MAA Elections 2021: నిన్ను చంపేస్తా అంటూ పోలింగ్ బూతులో ఊగిపోయిన మోహన్ బాబు

MAA Elections 2021 Live: ‘మా’ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూళ్లో మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరుగనున్నాయి. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటించనున్నారు. రాత్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 10, 2021 / 10:47 AM IST
    Follow us on

    MAA Elections 2021 Live: ‘మా’ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూళ్లో మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

    ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరుగనున్నాయి. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటించనున్నారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

    ‘మా’ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్యానెల్ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు లోపలికి రావడంపై విష్ణు ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతరులు లోపలికి రావడంతో ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది. మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని విష్ను ప్యానెల్ అడ్డుకుంది. ప్రకాష్ రాజ్ గన్ మెన్లను కూడా పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని ఎన్నికల అధికారి తెలిపారు.

    మా ఎన్నికల పోలింగ్ బూత్ లోకి వచ్చి కొందరు ప్రచారం చేస్తున్నారని మోహన్ బాబు సీరియస్ అయ్యారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తున్నారని మోహన్ బాబు పౌలింగ్ బూత్ లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే సమీర్ పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

    ‘మా’ పోలింగ్ బూత్ లో మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయాడు. నటుడు బెనర్జీని చంపేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విష్ణు ప్యానెల్-ప్రకాష్ రాజ్ సభ్యులు పరస్పరం తిట్టుకున్నారు. పోలింగ్ బూత్ లో ఎన్నికల అధికారితో మోహన్ బాబు మాట్లాడడంపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బెనర్జీపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు.