MAA elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే కసితో ఉన్నాడు మంచు విష్ణు (Manchu Vishnu). అందుకోసం అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే నరేష్ మద్దతుతో పాటు చాలామందిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ క్రమంలో జీవిత కూడా మొదట విష్ణుకే మద్దతు ఇచ్చింది. కానీ, మంచు విష్ణుకి జీవిత షాక్ ఇచ్చింది. ఆమె తన సపోర్ట్ విష్ణుకు కాకుండా సడెన్ గా ప్రకాష్ రాజ్ కి ఇవ్వడానికి అంగీకరించింది.
అసలు జీవిత ఇలా హఠాత్తుగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేరిపోవడానికి ప్రధాన కారణం మెగా కాంపౌండే. పైగా ప్రకాష్ రాజ్ పర్సనల్ గా ఫోన్ చేసి మరీ జీవితను తన ప్యానెల్ లోకి ఆహ్వానించాడు. ఇక “మా” ఎన్నికలు కూడా వచ్చే నెలలోనే జరగబోతున్నాయి. ఎలాగూ ప్రెసిడెంట్ రేసులో నుండి ప్రకాష్ రాజ్, విష్ణు మాత్రమే మిగిలేలా ఉన్నారు.
జీవిత రాజశేఖర్, హేమ దాదాపు తప్పుకున్నట్లే. ఇక పోటీలో సీవీఎల్ పెద్దగా ఎలాంటి ప్రభావం చూపించకపోవచ్చు. విచిత్రంగా జీవితతో పాటు హేమ కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ వైపు రావడం అందరికీ షాక్ ఇచ్చే విషయమే. మొదటి నుంచి హేమ విష్ణుకు సపోర్ట్ చేసే విధంగా మాట్లాడింది. కానీ, ఆమె కూడా మంచు విష్ణుకు హ్యాండ్ ఇచ్చి ప్రకాష్ రాజ్ టిమ్ లో జాయిన్ అయిపోవడంతో విష్ణు అప్రమత్తం అవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అన్నిటికి కంటే ముందుగా మంచు విష్ణు తన ప్యానెల్ ను ప్రకటించాల్సి ఉంది. మంచు విష్ణుకు స్టార్ హీరోల్లో కొంతమంది నుంచి గట్టి మద్దతు ఉంది. నందమూరి బాలకృష్ణ వర్గంతో పాటు మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్లు మద్దతు కూడా విష్ణుకే ఉంది. కాబట్టి, విష్ణుకు గెలిచే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. అందుకే విష్ణు కూడా గెలుపు పై నమ్మకంగా ఉన్నాడు.