M S Raju: అరెరే రాజు గారికి ఏమైంది ? పెద్దరికం వచ్చాక ఆయన మనసు మొత్తం బూతు మయం అయిపోయిందేమిటి ?. ఆయన గతమంతా విలువలతో సాగింది. కానీ, వర్తమానమే అద్వానంగా తయారైంది. ఏ మనిషినైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుందనే సంగతి రాజుగారికి తెలియంది కాదు. అయినా, ఎందుకు బూతు చుట్టూ తన ఆలోచనలను ‘కేంద్రీకృతం’ చేస్తున్నారు. కింద పడ్డారని పద్దతి మార్చుకుంటే ఎలా ? విజయం కోసం విలువలు వదిలేసి ప్రయత్నం చేయాలా ?
ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అంటేనే మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ‘మనసంతా నువ్వే ‘, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘పౌర్ణమి’ వంటి ఎన్నో మంచి చిత్రాలను ఆయన అందించారు. అందుకే, యావత్తు తెలుగు సినీ జనం ఆయనను ఎంతో గౌరవంగా చూసేవారు. అసలు ఎం.ఎస్ రాజు అంటేనే భారీ సినిమాలకు ప్రతీక. కానీ రోజులు మారాయి, ఆయన ప్రభ, వైభవం అంతా గతం అయిపోయింది.
ప్రస్తుతం రాజుగారు బూతు సినిమాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఆయన దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ అనే బూతు సినిమా తీసి హిట్ కొట్టారు. నిజానికి ‘డర్టీ హరి’ కేవలం బోల్డ్ నెస్ తోనే హిట్ అవ్వలేదు. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడనే కాన్సెప్ట్ తో సాగింది. దానికి తోడు ఆ సినిమా నిండా బూతులు, బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. అయితే , ఇవి ఉన్నాయనే సినిమా హిట్ అయిందనే అపోహలో రాజుగారు వెళ్లిపోయారు. ఆయన మళ్ళీ బూతు సినిమాకి శ్రీకారం చుట్టారు.
అయినా సినిమాలో మెయిన్ పాయింట్ ఉంటేనే హిట్ అవుతుంది కానీ, ఓన్లీ, కిస్ లు హగ్ ల వల్ల సినిమా హిట్ అవ్వదు. కానీ, రాజుగారు మాత్రం హద్దులు మీరిన సన్నివేశాలతో దర్శకుడిగా అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలను రాసుకుని సినిమాలు తీసుకుంటూ పోవాలని గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు.
Also Read: Mehreen Pirzada: ఆ డైరెక్టర్ జీవితంతో ఆడుకుంటున్న హీరోయిన్ !
గత సినిమా ‘7 డేస్ 6 నైట్స్’ అంటూ ఒక సినిమా వదిలారు. అది బాగానే డబ్బులు చేసుకుంది. తాజాగా మరో బూతు సినిమాకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సినిమా పేరు ‘సతి’. ఈ సినిమాని నిన్న ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాలో పరిధికి మించి బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి. పాపం.. రాజుగారు చివరకు ఇలా అయిపోయారు.
Also Read: Rajya Sabha Seats: రాజ్యసభ స్థానాలకు పార్టీ పల్లకి మోసేవారు వద్దు.. పారిశ్రామికవేత్తలే ముద్దు
Recommended Videos:
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More