దిల్ రాజుని బెదిరిస్తున్న భారీ నిర్మాణ సంస్థ !

‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, టాప్ సౌత్ డైరెక్టర్ శంకర్ తో సినిమా సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. శంకర్ కి ఉన్న సమస్య నుండి బయట పడటానికి చరణ్ తన పలుకుబడిని కూడా ఉపయోగించాడు. మొత్తానికి చాలా సిట్టింగ్స్ కూర్చోని చరణ్, శంకర్ తో సినిమాకి లైన్ క్లియర్ చేసుకున్నాడు. ఎలాగైనా వచ్చే నెలలో సినిమాని లాంఛనంగా మొదలు పెట్టాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ, చరణ్ – శంకర్ సినిమా షూటింగ్ […]

Written By: admin, Updated On : July 24, 2021 11:54 am
Follow us on

‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్, టాప్ సౌత్ డైరెక్టర్ శంకర్ తో సినిమా సెట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. శంకర్ కి ఉన్న సమస్య నుండి బయట పడటానికి చరణ్ తన పలుకుబడిని కూడా ఉపయోగించాడు. మొత్తానికి చాలా సిట్టింగ్స్ కూర్చోని చరణ్, శంకర్ తో సినిమాకి లైన్ క్లియర్ చేసుకున్నాడు.

ఎలాగైనా వచ్చే నెలలో సినిమాని లాంఛనంగా మొదలు పెట్టాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ, చరణ్ – శంకర్ సినిమా షూటింగ్ ని ఎలాగైనా ఆపేలా తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పక్కా ప్లాన్స్ తో ముందుకు పోతుంది. నిజానికి ఈ విషయంలో ఇప్పటికే లైకా కోర్టులో ఓడిపోయింది.

ఎలాగూ ‘పై కోర్టు’కు వెళ్తుంది. ఈ లోపు నిర్మాత దిల్ రాజుపై ఒత్తిడి పెంచుతూ.. సినిమా చేస్తే మీకే సమస్యలు వస్తాయి అంటూ ఇన్ డైరెక్ట్ గా బెదిరిస్తోందట. లైకా సంస్థ మొదటి నుండి ఎమోషనల్ ప్రెజర్ చేస్తూ.. తమ 170 కోట్లు ఆగిపోయాయి అని, నిర్మాతగా మా బాధని అర్థం చేసుకోవాలని దిల్ రాజును కొరుకుతోంది.

కానీ దిల్ రాజు ఇప్పటికే ఈ సినిమా చేస్తానని కమిట్ అయిపోయాడు. కాబట్టి, ఈ సమయంలో నేను వెనక్కి వెళ్ళలేను అంటూ ‘లైకా’కి క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో మా పరిస్థితి మీకు వస్తోంది జాగ్రత్త అంటూ లైకా అన్నట్టు సమాచారం. మరి దిల్ రాజు ఏం చేస్తాడో చూడలి.