https://oktelugu.com/

‘Ka Movie Collections : కిరణ్ అబ్బవరం ‘క’ 9 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..9వ రోజు అమాంతం పెరిగిపోయిన వసూళ్లు..కారణం అదేనా?

శుక్రవారం సాయంత్రం నుండి వీకెండ్ మొదలు అవుతుంది కాబట్టి, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ కొన్ని ప్రాంతాల్లో బాగుంటాయి. అందుకే 9వ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి 9 రోజులకు గాను ఎంత షేర్ వసూళ్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

Written By:
  • Vicky
  • , Updated On : November 9, 2024 / 04:14 PM IST

    KA Movie Collections

    Follow us on

    Ka Movie Collections :  యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘క’ ఇటీవలే దీపావళి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై మంచి ఓపెనింగ్ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కిరణ్ అబ్బవరం సినిమాలకు వచ్చిన ఫుల్ రన్ కలెక్షన్స్ ని ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే అధిగమించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. కేవలం వీకెండ్ తోనే బాక్స్ ఆఫీస్ రన్ ఆగిపోకుండా, మామూలు వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తున్నాయి. ఉదాహరణకి 9వ రోజు వచ్చిన వసూళ్లు 8వ రోజుకంటే ఎక్కువ వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. 8వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగ, 9వ రోజు 53 లక్షలు వచ్చింది. ఎందుకంటే శుక్రవారం సాయంత్రం నుండి వీకెండ్ మొదలు అవుతుంది కాబట్టి, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ కొన్ని ప్రాంతాల్లో బాగుంటాయి. అందుకే 9వ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి 9 రోజులకు గాను ఎంత షేర్ వసూళ్లు వచ్చాయో ఇప్పుడు చూద్దాం.

    ట్రేడ్ వర్గాల నుండి వచ్చిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఈ చిత్రానికి నైజాం ప్రాంతంలో 4 కోట్ల 51 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతంలో విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 3 కోట్ల 60 లక్షల రూపాయలకు జరగగా, ఇప్పటి వరకు దాదాపుగా కోటి రూపాయిల లాభం వచ్చినట్టు తెలుస్తుంది. ఫుల్ రన్ లో ఈ చిత్రానికి ఈ ప్రాంతంలో 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తుందని అంచనా. ఇక సీడెడ్ ప్రాంతంలో ఈ చిత్రానికి 9 రోజులకు 2 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కిరణ్ అబ్బవరం పుట్టి పెరిగిన ప్రాంతంలో క్లీన్ హిట్ కొట్టడం కిరణ్ అబ్బవరం కి మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు. అదే విధంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ సినిమాకి 9 రోజులకు 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 9 రోజుల్లో 12 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి ఇప్పటి వరకు కేవలం 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ ప్రాంతాల్లో మొదటి రోజు నుండి ఈ చిత్రానికి టాక్ కి తగ్గ వసూళ్లు రాలేదు. అదే విధంగా ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఇప్పటి వరకు ఈ సినిమాకి 6 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కప్రకారం షేర్ ని చూస్తే మూడు కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా.. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 9 రోజులకు 29 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 16 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఫుల్ రన్ లో 50 గ్రాస్ మార్కుని అందుకుంటుందని అందరూ అంచనా వేశారు, మరి అంత దూరం ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది చూడాలి.