Lucky Baskhar First Review: ‘లక్కీ భాస్కర్’ మొట్టమొదటి రివ్యూ..చివరి 15 నిమిషాలు హైలైట్..క్లైమాక్స్ లో హీరో చనిపోతాడా?

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 31 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిన్న ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Written By: Vicky, Updated On : October 22, 2024 2:18 pm

Lucky Baskhar First Review

Follow us on

Lucky Baskhar First Review: ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో మంచి పౌలారిటీ ని సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ లో మమ్మూటీ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన దుల్కర్, తన అద్భుతమైన టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ తండ్రినే మించిన తనయుడిగా మారిపోయాడు. ఈయన టాలెంట్ కేవలం మలయాళం ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం కాలేదు, ఇతర భాషలకు కూడా ఎగబాకింది. తమిళం లో, హిందీ లో ప్రత్యేకంగా సినిమాలు చేసి భారీ హిట్స్ ని అందుకున్న దుల్కర్, తెలుగు లో కూడా ‘సీతారామం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకొని మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కల్కి చిత్రం తో మన ఆడియన్స్ కి మరింత దగ్గరైన దుల్కర్, ఇప్పుడు లక్కీ భాస్కర్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 31 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిన్న ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా నిన్న ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షోని కొంతమంది ముఖ్యులకు వేసి చూపించారట. వారి నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల కాలం లో ఇంత సహజమైన ఎమోషన్స్ తో ఉండే సినిమా రాలేదని, ప్రతీ సామాన్యుడు దుల్కర్ లో తమని తాము ఊహించుకొని వెండితెర మీద చూసుకుంటారని, అంత సహజం గా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని అంటున్నారు. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం లో పుట్టి, ప్రతీ ఒక్కరి దగ్గర అప్పులు చేసి, వాటిని కట్టలేక, పెళ్ళాం పిల్లల్ని పోషించలేక అష్టకష్టాలు పడుతున్న భాస్కర్ కుమార్ కి అవినీతి మార్గం లోకి వెళ్లి డబ్బులు సంపాదించడం, ఆ తర్వాత అతను జీవితం లో ఎదురుకున్న పరిణామాలను డైరెక్టర్ వెంకీ ఎంతో అద్భుతంగా చూపించాడట.

ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా వేరే లెవెల్ లో వెళ్తుందని, క్లైమాక్స్ కి ఆడియన్స్ ఏడ్చేస్తారని అని అంటున్నారు. ఈమధ్య వస్తున్నా అనేక సినిమాల్లో అవినీతి మార్గం లో వెళ్లిన హీరోలు క్లైమాక్స్ లో చనిపోవడం వంటివి చూసాము. అలా ఈ చిత్రంలో కూడా హీరో చనిపోతాడా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు. మరి ఇంతకు అంత ఎమోషనల్ ఎలిమెంట్స్ క్లైమాక్స్ లో ఏమి ఉంది అనే విషయం తెలియాలంటే మరో 8 రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించాడు.