Telugu Heroine: తెలుగు హీరోయిన్ ప్రియాంక జవాల్కర్, క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తో డేటింగ్‌లో ఉందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను ఇప్పటికే చాలా రకాలుగా తెగ ట్రోల్ చేశారు. అయితే, అవేమి పట్టించుకోని ప్రియాంక.. మొన్న మరో ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది కూడా. ఫొటోలో ప్రియాంక ఓ రెస్టారెంట్‌లో ఒక అబ్బాయితో కూర్చుని ఉంది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.
ఐతే, ప్రియాంక తెలివిగా ఆ అబ్బాయిని బ్యాక్ నుంచి చూపించింది. ఆమెతో ఫొటోలో ఉన్న ఆ వ్యక్తి ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యరే అని నెటిజన్లు కామెంట్లు చేశారు. నెటిజన్ల కామెంట్లకు తగ్గట్టుగానే.. బ్యాక్ నుంచి నెక్ భాగం అచ్చు వెంకటేశ్ లానే ఉంది. పైగా.. ప్రియాంక ఈ ఫోటోలు షేర్ చేస్తూ ‘అతనే లవ్’ అంటూ హార్ట్ ఎమోజీని కూడా పోస్ట్ చేసింది.
మొత్తానికి ప్రియాంక జవాల్కర్ ప్రేమ పాఠాలతో తెగ వైరల్ అయింది. అయితే, తాజాగా ఎట్టకేలకు ఈ రూమర్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టింది ప్రియాంక జవాల్కర్. సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇస్తూ ‘‘ఫొటోలోని అబ్బాయి ఫోటో సెషన్ పనుల్లో మాకు సహాయం చేయడానికి వచ్చాడు అండి . అతను నాకు బాయ్ ఫ్రెండ్ అంటూ వార్తలు రావడంపై మా అమ్మ నన్ను అడుగుతోంది.
Also Read: North-Andhra Ministers: ఉత్తరాంధ్రలో తాజా మాజీలకు ఎదురుదెబ్బ.. సొంత కుటుంబసభ్యుల నుంచే సవాళ్లు
ఇక దీని గురించి మాట్లాడటం మానేస్తే బావుంటుంది’’ అని ప్రియాంక జవాల్కర్ క్లారిటీ ఇచ్చింది. ఐతే, ఇంత చెప్పింది గానీ, ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యరేతో లవ్ లో ఉందో లేదో మాత్రం చెప్పలేదు. ఆ మధ్య ప్రియాంక తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫొటోకు అయ్యర్ ‘క్యూట్’ అంటూ రిప్లై ఇచ్చి తెగేది సిగ్గుపడిపోయాడు. దీని బట్టి అతను ఆమెతో లవ్ లో ఉన్నాడని పుకార్లు పుట్టించారు గాసిప్ రాయుళ్లు.
ఇక ప్రియాంక జవాల్కర్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. ముంబై భామలకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఉన్నా.. ఎందుకో టాలీవుడ్ మేకర్స్ మాత్రం ప్రియాంక జవాల్కర్ ను చిన్న చూపే చూశారు. అందుకే, చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ చిన్న హీరోయిన్ గానే మిగిలిపోయింది ప్రియాంక జవాల్కర్. మధ్యలో ఇలా ప్రేమ పుకార్లతో వార్తల్లో నిలుస్తోంది.
Also Read: Theaters Close In AP: ఏపీలో ధియేటర్లు క్లోజ్.. కారణం అదే ?