Love Today Collections: ఇటీవల కాలం లో అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమై బాక్స్ ఆఫీస్ వద్ద అనితరసాధ్యమైన వసూళ్లను రాబట్టిన సినిమాలలో ఒకటి ‘లవ్ టుడే’..5 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం తమిళనాడులోనే 75 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ప్రదీప్ రంగనాథన్ అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తూ ఈ సినిమాలో హీరో గా నటించాడు..ఈ సినిమాని చూసే ప్రతి ఒక్కరికి చాలాకాలం తర్వాత ఒక హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ ని చూసిన అనుభూతి కలిగింది..ప్రేమించుకున్న ఒక జంట తమ మొబైల్ ఫోన్స్ ఒకరిది ఒకరు మార్చుకుంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.

ఒకరికి తెలియకుండా ఒకరు ఎలాంటి సీక్రెట్స్ ని దాచిపెట్టుకున్నారు..వాటివల్ల వచ్చే ఫన్ మరియు సెంటిమెంట్ ని చాలా చక్కగా బ్యాలన్స్ చేస్తూ ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు..తమిళనాడు లో అంతతి సంచలన విజయం సాధించిన ఈ సినిమాని తెలుగు లో దబ్ చేసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే విడుదల చెయ్యగా ఇక్కడ కూడా ఈ సినిమాకి అద్భుతమైన ఆదరణ దక్కింది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది..మొదటి రోజే కోటి రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి వారం రోజులకు కలిపి 5 కోట్ల 45 లక్షల రూపాయిల షేర్ మరియు 10 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..అంటే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి అదనంగా రెండు కోట్ల 50 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి.

సినిమాకి మరో వీకెండ్ కూడా మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉండడం తో ఫుల్ రన్ లో 7 నుండి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కచ్చితంగా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు..అలా టాలీవుడ్ లో కాంతారా తర్వాత మరో డబ్బింగ్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి బయ్యర్స్ కి కాసుల కనకవర్షం కురిపించింది.