Sai Dharam Tej- NTR: మెగా ఫ్యామిలీ నుండి సినీ ఇండస్ట్రీ కి వచ్చి అతి తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ ని సంపాదించిన హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు..పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ , చిత్రలహరి , ప్రతిరోజు పండగే, సోలో బ్రతుకే సో బెటర్ వంటి సూపర్ హిట్స్ తో యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న సాయి ధరమ్ తేజ్ గత కొంత కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటి వరుకు ఆయన రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనలేదు..BVSN ప్రసాద్ నిర్మాతగా కార్తీక్ దండు అనే దర్సకుడితో ఒక సినిమా చేస్తునట్టు అధికారిక ప్రకటన అయితే చేసాడు కానీ ఇప్పటి వరుకు ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు..ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందించాడు..అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
ఇక అసలు విషయానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుండే ప్రారంభం కాబోతుందట..సాయి ధరమ్ తేజ్ కి ఇది 15 వ చిత్రం..రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే ముందు ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు అట..టీజర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంచ్ చెయ్యబోతున్నట్టు సమాచారం..సాయి ధరమ్ తేజ్ కి చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ కాకుండా బయట హీరోలలో ఎన్టీఆర్ ని బాగా ఇష్టపడుతారు అనే సంగతి మనకి తెలిసిందే..గతం లో కూడా ఈ విషయాన్నీ ఆయన ఎన్నో సందర్భాలలో తెలిపాడు.

అందుకే చాలాకాలం తర్వాత షూటింగ్ లో పాల్గొనబోతున్న సాయి ధరమ్ తేజ్ కి తన ఫస్ట్ లుక్ టీజర్ ని ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేయిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడట..మరోపక్క మెగా ఫ్యాన్స్ సాయి ధరమ్ తేజ్ పై విరుచుకుపడుతున్నారు..మెగా హీరోలు అంతమంది ఉండగా ఎన్టీఆర్ తో ఫస్ట్ లుక్ టీజర్ ని లాంచ్ చేయించడం ఏమిటని సోషల్ మీడియా లో సాయి ధరమ్ తేజ్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు.