https://oktelugu.com/

Love Story Collections : బ్లాక్ బస్టర్ హిట్.. కలెక్షన్స్ మరీ ఇంతనా?

Love Story Collections : నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్లవి జంట‌గా.. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన చిత్రం ‘ల‌వ్ స్టోరీ’. ఎప్పుడో స‌మ్మ‌ర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డి సెప్టెంబర్ 24వ తేదీన రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ తో అంద‌రికీ షాకిచ్చింది. ఫిదా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన‌ శేఖ‌ర్ క‌మ్ముల‌-సాయిప‌ల్లవి కాంబో అన‌గానే ఒక విధ‌మైన క్రేజ్ ఏర్ప‌డిందీ చిత్రానికి. సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా […]

Written By:
  • Rocky
  • , Updated On : October 12, 2021 11:30 am
    Love Story Review
    Follow us on

    Love Story Collections : నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్లవి జంట‌గా.. ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన చిత్రం ‘ల‌వ్ స్టోరీ’. ఎప్పుడో స‌మ్మ‌ర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డి సెప్టెంబర్ 24వ తేదీన రిలీజ్ అయ్యింది. అయితే.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ తో అంద‌రికీ షాకిచ్చింది.

    love story movie will on aha

    ఫిదా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన‌ శేఖ‌ర్ క‌మ్ముల‌-సాయిప‌ల్లవి కాంబో అన‌గానే ఒక విధ‌మైన క్రేజ్ ఏర్ప‌డిందీ చిత్రానికి. సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా బాగుండ‌డం.. సారంగ ధ‌రియా పాట‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు పెరిగాయి. ఈ సినిమాకు దాదాపు 32 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది నాగచైతన్య కెరీర్లోనే భారీ బిజినెస్.

    అయితే.. ఆశించిన విధంగానే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మూడురోజులపాటు కలెక్షన్స్ స్టడీగా ఉనాయి. దీంతో.. బొమ్మ బ్లాక్ బస్టర్ కావడం గ్యారంటీ అనుకున్నారు. కానీ.. క్లోజింగ్ కలెక్షన్స్ చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

    ఈ సినిమా హవా కొనసాగుతుండగానే.. గులాబ్ తుఫాను విరుచుకుపడింది. రెండు రాష్ట్రాలనూ అల్లకల్లోలం చేసిన ఈ తుఫాను.. సినిమా థియేటర్లపైనా ప్రభావం చూపింది. నగరాలను వరద ముంచెత్తడంతో జనాలు సినిమాల గురించి పట్టించుకొలేదు. ఫలితంగా లవ్ స్టోరీ కలెక్షన్లపై ప్రభావం పడింది.

    గడిచిన 18 రోజుల్లో ఈ సినిమా నైజాంలో 12.50 కోట్లు, సీడెడ్‌లో 4.50 కోట్లు, ఉత్తరాంధ్రలో 3 కోట్లు, తూ.గో జిల్లాలో 1.65 కోట్లు, ప.గో.జిల్లాలో 1.40 కోట్లు, గుంటూరులో 1.52 కోట్లు, కృష్ణాలో రూ.1.38 కోట్లు, నెల్లూరులో రూ.92 లక్షలు వసూలు చేసింది. కర్నాటకలో 2.25, ఓవర్సీస్ లో 7 కోట్లు రాబట్టింది. మొత్తంగా 35 కోట్ల షేర్ సాధించి.. నామమాత్రపు లాభాన్ని సొంతం చేసుకుంది.