https://oktelugu.com/

ఫ్యాన్స్‌కు పండగే.. రజినీ- కమల్‌ కాంబో ఫిక్స్‌..

సూపర్ స్టార్ రజినీ కాంత్‌, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌కు ఉన్న స్టార్డమ్‌ అంతా ఇంతా కాదు. దక్షిణాదిలోనే కాదు దేశమంతటా ఈ ఇద్దరికీ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తన స్టైల్‌లో రజినీ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తే.. వైవిధ్య చిత్రాలతో ఆశ్చర్యపరుస్తుంటాడు కమల్‌. ఇద్దరిలో ఎవరి సినిమా వచ్చినా దేశమంతా ఎదురు చూస్తుంది. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాల క్రేజ్‌ పెరిగింది కానీ.. రజినీ, కమల్‌ ఎప్పటి నుంచో పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తున్నారు అనొచ్చు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 18, 2020 / 04:43 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ రజినీ కాంత్‌, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌కు ఉన్న స్టార్డమ్‌ అంతా ఇంతా కాదు. దక్షిణాదిలోనే కాదు దేశమంతటా ఈ ఇద్దరికీ కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తన స్టైల్‌లో రజినీ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్‌ చేస్తే.. వైవిధ్య చిత్రాలతో ఆశ్చర్యపరుస్తుంటాడు కమల్‌. ఇద్దరిలో ఎవరి సినిమా వచ్చినా దేశమంతా ఎదురు చూస్తుంది. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాల క్రేజ్‌ పెరిగింది కానీ.. రజినీ, కమల్‌ ఎప్పటి నుంచో పాన్‌ ఇండియా చిత్రాలు చేస్తున్నారు అనొచ్చు. అంతలా అభిమానులకు చేరువయ్యారు ఈ చెన్నై తంబీలు. దాదాపు ఒకేసారి కెరీర్ మొదలు పెట్టిన ఈ ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఈ మధ్యే ఇద్దరూ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అయితే, ఇద్దరి శైలి మాత్రం భిన్నం. రజినీ మాస్‌, కమర్షియల్‌ సినిమా కేరాఫ్‌ అడ్రస్‌. కమల్‌ ఏమో ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాలు తీస్తుంటాడు.

    Also Read: లెజెండరీ సింగర్ కరోనాని జయిస్తున్నారు !

    వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. కానీ, ఈ మధ్య కాలంలో కలిసి సినిమా చేయలేదు. చాన్నాళ్ల నుంచి ఈ స్టార్ హీరోలిద్దరితో ఓ చిత్రం చేయాలని పలువురు ప్రయత్నించారు. రకరకాల కారణాలతో అవి పట్టాలెక్కలేదు. అయితే, కార్తితో ‘ఖైదీ’ తీసి సూపర్ హిట్‌ కొట్టిన లోకేశ్ కనకరాజ్‌ దర్శకత్వంలో రజినీ, కమల్‌లతో ఓ సినిమా రాబోందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. దీనికి కమల్‌ హాసన్‌ నిర్మతగా కూడా వ్యవహరిస్తారని అన్నారు. రజినీ ‘అన్నాత్తే’ షూటింగ్‌ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్తుందని పలువురు భావించారు. కానీ, కరోనా దెబ్బకు షూటింగ్స్‌ ఆగిపోయాయి. అన్ని ప్లాన్స్‌ తలికిందులయ్యాయి. ఇక, రజినీ- కమల్‌ కాంబో కూడా ఆగిపోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ, ఈ మూవీ గురించి ఇప్పుడు కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ కచ్చితంగా ముందుకెళ్తుందని దర్శకుడు లోకేశ్ ప్రకటించాడు. ‘ఖైదీ’ తర్వాత విజయ్‌ హీరోగా ‘మాస్టర్’ తీసిన కనగరాజ్‌ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించాడు. తొందల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని, దాని తర్వాతే తాను ఇతర వివరాలు చెబుతానన్నాడు. దీన్ని బట్టి రజినీ- కమల్‌ కాంబో ఫిక్స్‌ అయిందని అర్థం చేసుకోవచ్చు. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వచ్చే చాన్సుంది. ప్రస్తుతం రజినీ ‘అన్నాత్తే’ చివరి దశలో ఉండగా… శంకర్ డైరెక్షన్‌లో కమల్‌ ‘ఇండియన్‌ 2’ లో నటిస్తున్నాడు. ఇవి పూర్తయిన వెంటనే రజినీ- కమల్‌ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లే చాన్సుంది. ఇద్దరు దిగ్గజ నటులు కలిస్తే వారి అభిమానులకు పండగే.