Little Hearts 4 days Collections: ఈ ఏడాది చిన్న సినిమాల జోరు ని కొనసాగిస్తూ, ఎలాంటి అంచనాలు లేకుండా రీసెంట్ గానే విడుదలైన ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts) అనే చిన్న చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న అద్భుతాలు సాధారణమైనవి కాదు. కేవలం మూడు కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ చిత్రం, రెండు రోజుల్లోనే ఆ మార్కుని అందుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో ట్రేడ్ కి సైతం మతి పొయ్యేలా చేస్తుంది ఈ సినిమా. వీకెండ్ లో అద్భుతమైన వసూళ్లను నమోదు చేసుకున్న ఈ చిత్రం, వర్కింగ్ డేస్ లో కాస్త నెమ్మదిస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ మొదటి సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి స్టడీ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం.
మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ కలిపి కేవలం 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇలా ప్రీమియర్స్ + మొదటి రోజు కి కలిపి అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడం తో దాని ప్రభావం రెండవ రోజు వసూళ్లపై బలంగా పడింది. దాదాపుగా కోటి 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రెండవ రోజు రాబట్టిన ఈ సినిమా, మూడవ రోజున కోటి 90 లక్షలు, నాల్గవ రోజున కోటి 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా నాలుగు రోజుల్లో 5 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 9 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. బాగా గమనిస్తే నాల్గవ రోజు వచ్చిన వసూళ్లు, మొదటి రోజు కంటే ఎక్కువ ఉన్నాయి. చాలా అరుదుగా ఇలాంటి సందర్భాలు ఎదురు అవుతుంటాయి.
అంతే కాదు ఈ చిత్రానికి కర్ణాటక+ ఓవర్సీస్ + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 6 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఊరు పేరు తెలియని నటీనటులు ఉన్న ఒక చిన్న సినిమాకి తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి ఇంత గ్రాస్ రావడం అనేది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా కు, 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. మూడు కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. అంటే పెట్టిన డబ్బులకంటే రెండు రెట్లు పైనే లాభాలు వచ్చాయి అన్నమాట. టాలీవుడ్ కష్టాల్లో ఉన్న సమయం లో ఇంత లాభాలు వచ్చే సినిమా దొరకడం సాధారణమైన విషయం కాదు.