Avatar 2 Collections: ‘టైటానిక్’ తర్వాత సుమారు పదేళ్ల పాటు ఎంతో కృషి చేసి డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తీసిన అవతార్ చిత్రం 2009 వ సంవత్సరం లో విడుదలై ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ఇప్పటికీ మనం మరచిపోలేము..మన స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే ఎలా ఎగబడి థియేటర్స్ కి కదులుతామో, ఈ చిత్రానికి ఆరోజుల్లో అలా ఎగబడ్డారు ఆడియన్స్..థియేటర్స్ లో ఈ సినిమా ఇచ్చిన అనుభూతి మామూలుది కాదు..ఒక సరికొత్త లోకంలోకి మనం అడుగుపెట్టామా..? అనేలా ఉంటుంది ఈ చిత్రం.

ఆరోజుల్లోనే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి..ఈ రికార్డు ని బద్దలు కొట్టడానికి హాలీవుడ్ చిత్రాలకు పదేళ్ల సమయం పట్టింది..2019 వ సంవత్సరం లో విడుదలైన ‘ఎవెంజర్స్ ఎండ్ గేమ్’ అవతార్ కలెక్షన్స్ రికార్డు ని బద్దలు కొట్టింది..మరో 5 రోజుల్లో ‘అవతార్ -2 ‘ విడుదల కాబోతుంది..ఈ చిత్రాన్ని తియ్యడానికి కూడా జేమ్స్ కామెరాన్ మరో పది సంవత్సరాల సమయం తీసుకున్నాడు.
అవతార్ వంటి ప్రభంజనం కి సీక్వెల్ కావడం తో ‘అవతార్ 2 ‘ పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి..అడ్వాన్స్ బుకింగ్స్ వారం రోజుల క్రితమే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రారంభించారు.. 3డి,2డి, ఐమాక్స్ మరియు 4DX ఫార్మట్స్ లో ఈ చిత్రం విడుదల కాబోతుంది..3డి బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మాములుగా లేవు.
అడ్వాన్స్ బుకింగ్స్ తెరిచిన నిమిషాల వ్యవధిలో టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి..ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ చిత్రానికి మొదటి రోజు కేవలం తెలంగాణ ప్రాంతం నుండే పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..ఆంధ్ర ప్రదేశ్ లో కూడా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ ఉన్నాయి..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు ఈ సినిమాకు 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చేలా ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

ఇదివరకు మన తెలుగు రాష్ట్రాల నుండి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం స్టార్ హీరోస్ కి మాత్రమే వచ్చాయి..మొట్టమొదటిసారి ఇప్పుడు ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీ కి 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మొదటి రోజు రాబోతున్నాయి..టాక్ సహకరిస్తే ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెప్తున్నారు.