https://oktelugu.com/

Prabhas: అక్షరాలా 276 కోట్ల రూపాయిల నష్టం..ప్రభాస్ ఖాతాలో ఇది కూడా ఒక రికార్డే!

బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన క్రేజ్ మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన బాహుబలి సిరీస్ తర్వాత మూడు సినిమాలు చేస్తే, మూడు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి.

Written By:
  • Vicky
  • , Updated On : June 21, 2023 / 02:48 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas: ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు తీస్తున్న ఏకైక హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.బాహుబలి సిరీస్ తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. నిర్మాతలు ఆయన సినిమాలు వరుసగా బోల్తా కొడుతున్నా కూడా వందల కోట్ల రూపాయిలు బడ్జెట్ పెట్టి సినిమాలు తియ్యడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రేంజ్ కి ఆయన ఎదిగాడు. అయితే నష్టాలను కూడా అదే రేంజ్ లో తెస్తున్నాడు ప్రభాస్.

    బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన క్రేజ్ మొత్తాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన బాహుబలి సిరీస్ తర్వాత మూడు సినిమాలు చేస్తే, మూడు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. మూడు ఫ్లాప్ సినిమాలకు వచ్చిన నష్టాలను లెక్కవేస్తే అది కూడా ఒక రికార్డుగా మిగిలిపోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒక్కసారి ఆ లెక్కలు ఏంటో చూద్దాము.

    బాహుబలి సిరీస్ తర్వాత వస్తున్న సినిమా కావడం తో ‘సాహూ’ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్నీ ప్రాంతాలకు కలిపి 290 కోట్ల రూపాయలకు జరిగింది. కానీ ఫుల్ రన్ లో 230 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టింది. అంటే అక్షరాలా 60 కోట్ల రూపాయిలు నష్టం అన్నమాట. ఇక ఆ తర్వాత విడుదలైన రాధే శ్యామ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 210 కోట్ల రూపాయలకు జరిగింది. కానీ ఫుల్ రన్ లో కేవలం 84 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టింది, అంటే అక్షరాలా 126 కోట్ల రూపాయిలు నష్టం అన్నమాట. ఇండియా లో ఈ సినిమానే అతి పెద్ద నష్టం కలిగించిన సినిమాగా చెప్పుకొచ్చారు ట్రేడ్ పండితులు.

    ఇప్పుడు ఆదిపురుష్ చిత్రం కూడా అదే జాబితా లోకి వెళ్లనుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి,బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 90 కోట్లు రాబట్టాలి, అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.అలా మూడు సినిమాలకు 276 కోట్ల రూపాయిలు నష్టపోయారని, ఇది ఆల్ టైం రికార్డుగా చెప్పుకొస్తున్నారు ట్రేడ్ పండితులు.