Prabhas Adipurush: అక్షరాలా 600 కోట్లు..’ఆదిపురుష్’ ఫ్లాప్ అయిన ఇసుమంత కూడా తగ్గని ప్రభాస్ క్రేజ్!

సాహూ చిత్రం కంటెంట్ పరంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది కానీ, కలెక్షన్స్ పరంగా ఆ సినిమా 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రాధే శ్యామ్ చిత్రం కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయిలు రాబట్టగా, రీసెంట్ గా విడుదలైన 'ఆదిపురుష్' చిత్రం కూడా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు దగ్గరగా వచ్చింది.

Written By: Vicky, Updated On : June 27, 2023 8:34 pm

Prabhas Adipurush

Follow us on

Prabhas Adipurush: ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ప్రభాస్ ని మించిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరూ లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.బాహుబలి తర్వాత ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు, కానీ కలెక్షన్స్ విషయం లో మాత్రం ఆయన ప్లాప్ సినిమాతో సమానంగా కూడా లేవు చాలా మంది ఇండియన్ సూపర్ స్టార్స్ సూపర్ హిట్ చిత్రాలు.

ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న చిత్రం. సాహూ చిత్రం కంటెంట్ పరంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది కానీ, కలెక్షన్స్ పరంగా ఆ సినిమా 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రాధే శ్యామ్ చిత్రం కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయిలు రాబట్టగా, రీసెంట్ గా విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రం కూడా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు దగ్గరగా వచ్చింది.

ఆయన సినిమాలకు ఫ్లాప్ టాక్ వస్తేనే ఈ రేంజ్ వసూళ్లు వస్తున్నాయంటే, ఇక హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ వసూళ్ల సునామి వస్తుందో ఊహించుకోవచ్చు. అందుకే ఆయనని హీరో గా పెట్టి ఎన్ని వందల కోట్ల రూపాయిలు బడ్జెట్ పెట్టడానికి అయినా సిద్దమైపోతారు నిర్మాతలు. ప్రస్తుతం ఆయన హీరో గా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ K’ చిత్రం పరిస్థితి కూడా అంతే. ఈ సినిమాకి కేవలం స్టార్ కాస్టింగ్ రెమ్యూనరేషన్స్ 300 కోట్ల రూపాయిలు దాటిపోయిందని టాక్. ఈ చిత్రం కోసం ప్రభాస్ 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడు.

ఆయన రెమ్యూనరేషన్ తో పాటుగా దీపికా పదుకొనే మరియు అమితాబ్ బచ్చన్ రెమ్యూనరేషన్స్ కలిపి 168 కోట్ల రూపాయిలు అయ్యిందట. ఇక రీసెంట్ గానే ఈ చిత్రం లోకి కమల్ హాసన్ కూడా జాయిన్ అయ్యాడు. ఆయన ఈ చిత్రం లో చేస్తున్నందుకు వంద కోట్ల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. ఇక మిగిలిన క్యాస్ట్ & క్రూ పారితోషికాలు కూడా కలిపితే 300 కోట్లు దాటేస్తుందట, వీటితో పాటుగా మరో 300 కోట్ల రూపాయిలు మేకింగ్ కోసం ఖర్చు చేస్తున్నారు. అలా మొత్తం కలిపి ఈ సినిమాకి 600 కోట్ల రూపాయిలు బడ్జెట్ అవుతున్నట్టు టాక్.