Balayya : వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో కెరీర్ చివరి దశకు వచ్చిన సమయంలో నందమూరి బాలకృష్ణ కి అఖండ చిత్రం ఇచ్చిన విజయం సాధారమైనది కాదు. అంతకు ముందు కూడా ఆయనకి ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్లు చాలానే ఉన్నాయి. కానీ ఒక హిట్ తర్వాత వరుసగా నాలుగైదు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను ఇవ్వడం బాలయ్య కి అలవాటు గా ఉండేది. వరుస బ్లాక్ బస్టర్ హిట్లు 2020 కి ముందు ఆయన ఒక్కసారి కూడా చూడలేదు. కానీ 2020 వ సంవత్సరం తర్వాత అసలు ఫ్లాప్ అనేదే తెలియకుండా బాలయ్య బాబు కెరీర్ ముందుకు దూసుకుపోతుంది. అఖండ తర్వాత ఆయన చేసిన ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ చిత్రాలు కమర్షియల్ గా బాలయ్య స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. ‘డాకు మహారాజ్’ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా, ఎబోవ్ యావరేజ్ రేంజ్ స్టేటస్ ని దక్కించుకుంది.
అయితే బాలయ్య గత నాలుగు సినిమాల కలెక్షన్స్ ని కలిపితే 526 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అఖండ చిత్రానికి 133 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, వీర సింహా రెడ్డి చిత్రానికి 134 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా భగవంత్ కేసరికి చిత్రానికి 132 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, డాకు మహారాజ్ చిత్రానికి ఇప్పటి వరకు 127 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద నాలుగు సినిమాలకు కలిపి 526 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సీనియర్ హీరోల క్యాటగిరీలో ఇదొక అరుదైన రికార్డు గా పరిగణించొచ్చు. ప్రస్తుతం ఆయన ‘అఖండ 2 ‘ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతుంది.
ఎందుకంటే ‘అఖండ 2 ‘ మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలు రేంజ్ కాదనే చెప్పాలి. ‘అఖండ’ చిత్రం అతి తక్కువ టికెట్ రేట్స్ మీద 133 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందంటే, ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే పాన్ ఇండియన్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు వసూళ్లు ఉంటాయని మనం ఒక అంచనాకి రావొచ్చు. ఈమధ్యనే షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమా, ఈ ఏడాది సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేకర్స్ అయితే విడుదల తేదీని ప్రకటించారు కానీ, ఆ సమయానికి సినిమా పూర్తి అవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.