Sankranti Akamanam : విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం విడుదలై 20 రోజులు గడుస్తున్నా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద జోరు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆడియన్స్ కి ఈ సినిమానే మొదటి ఛాయస్ గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ వీకెండ్స్ లో మాత్రమే కాదు, మామూలు వర్కింగ్ డేస్ లో కూడా ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ సమయంలో క్యూలు కట్టేస్తున్నారు. ఇక వీకెండ్స్ వచ్చాయంటే పండగ వాతావరణం ని తలపిస్తున్నారు. 20 వ రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో ఏకంగా 75 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. కొన్ని చోట్ల అయితే థియేటర్స్ ని పెంచుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 20వ రోజు 2 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.
అంతే కాదు 20వ రోజు ఈ చిత్రం అనేక ప్రాంతాలలో ప్రెస్టీజియస్ బెంచ్ మార్క్స్ ని కూడా అధిగమించినట్టు తెలుస్తుంది. నైజాం ప్రాంతంలో నిన్నటితో 41 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిందట. రాజమౌళి సినిమాలు కాకుండా ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన సినిమాలు సలార్, కల్కి, పుష్ప 2 , అలా వైకుంఠపురంలో మరియు దేవర చిత్రాలు మాత్రమే, ఇప్పుడు ఆ జాబితాలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా చేరిపోయింది. అదే విధంగా సీడెడ్ లో 20 రోజులకు గాను ఈ చిత్రానికి 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఫుల్ రన్ లో 20 కోట్లు రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే ఈ సినిమాకి ఏకంగా 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకో మూడు కోట్లు రాబడితే ఆల్ టైం నాన్ రాజమౌళి రికార్డ్ అని చెప్పొచ్చు.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి 135 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, వరల్డ్ వైడ్ గా 155 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. బాక్స్ ఆఫీస్ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 264 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ నిర్మాతలు మాత్రం 303 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు. ఒకవేళ అంత వసూళ్లను ఈ సినిమా రాబడితే, ప్రాంతీయ బాషా చిత్రాలలో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు రాబట్టిన సినిమాగా చరిత్ర సృష్టిస్తుంది. మరి ఫుల్ రన్ లో అంత రేంజ్ కి వెళ్తుందో లేదో చూడాలి. దాదాపుగా అన్ని ప్రాంతాలలో ఈ సినిమా టాప్ 2 / టాప్ 3 గ్రాసర్ గా నిల్చింది. ఫుల్ రన్ ఎక్కడ ఆగుద్దో చూడాలి.