Kannappa : మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న తన డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది. ఈ సినిమాలో వివిధ భాషలకు సంబంధించిన సూపర్ స్టార్స్ తో పాటు, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ముఖ్య పాత్ర పోషించాడు అనే విషయం తెలిసిందే. చాలా కాలం నుండి ప్రభాస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు. నేడు ఆయన ఫస్ట్ లుక్ విడుదల అయ్యేలోపు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ముందుగా ప్రభాస్ శివుడి క్యారక్టర్ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ శివుడి క్యారక్టర్ అక్షయ్ కుమార్ చేస్తున్నాడని, ఆయన ఫస్ట్ లుక్ తో సహా విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించడంతో, మరి ప్రభాస్ ఏ క్యారక్టర్ చేస్తున్నాడు అనేది అభిమానులకు అర్థం కాలేదు.
ఎట్టకేలకు నేడు ఆయన ఏ క్యారక్టర్ చేస్తున్నాడు అనే దానిపైన కూడా సస్పెన్స్ వీడింది. రుద్రుడు శివుడి అంశానికి చెందినవాడు. ఈ ప్రపంచం లో వచ్చే ప్రళయాలు ఆయనే కారణం. అంతే కాకుండా ప్రపంచంలో ఎలాంటి రోగనికైనా ఆయన వద్ద ఔషధం లభించగలడు. ఇక యుద్ధ భూమి లోకి రుద్రుడు అడుగుపెట్టాడంటే, ముల్లోక దేవుళ్ళు కలిసి వచ్చినా కూడా ఆయన్ని ఓడించలేరు. ఇలాంటి క్యారక్టర్ ని ప్రభాస్ ఈ చిత్రంలో చేస్తున్నాడు. మహాశివుడు క్యారక్టర్ ఈ చిత్రం కేవలం 5 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందట. కానీ రుద్ర క్యారక్టర్ 40 నిమిషాల పాటు కనిపిస్తుందట. అంతే కాకుండా ఆ క్యారక్టర్ కి ఒక పాట కూడా ఉంటుందట. హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆ క్యారక్టర్ ని ప్రభాస్ చేసినట్టు తెలుస్తుంది. మహాశివుడి క్యారక్టర్ కేవలం క్లైమాక్స్ లో మాత్రమే కనిపిస్తుందట, అది కూడా కేవలం 5 నిమిషాలు మాత్రమే.
పైన చెప్పిన విధంగా డైరెక్టర్ కరెక్ట్ గా ప్రభాస్ ని ఈ చిత్రం లో చూపించగలిగితే ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు వస్తాయి. ప్రభాస్ కటౌట్ ని సరిగ్గా వాడిన దర్శకులు విఫలం అయినట్టు చరిత్రలో లేదు. ‘సలార్’ చిత్రం కేవలం ప్రభాస్ కటౌట్ స్క్రీన్ ప్రెజెన్స్ మీదనే 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరి ‘కన్నప్ప’ కి డైరెక్టర్ ఎలా వాడుకున్నాడో చూడాలి. ఈ చిత్రం లో ప్రభాస్, అక్షయ్ కుమార్ లతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. వాళ్ళ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ కూడా విడుదలయ్యాయి. ఓవరాల్ గా ‘కన్నప్ప’ చిత్రం ఔట్పుట్ చాలా బాగా వచ్చిందట. VFX ఔట్పుట్ అద్భుతంగా వస్తే, ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సక్సెస్ అయ్యినట్టే.