Game Changer: ఇప్పుడు ఎక్కడ చూసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ మేనియా నే కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. వచ్చే వారం మంగళవారం వరకు బుకింగ్స్ ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ ఖరారు అయ్యాయి కానీ, తెలంగాణ లో ఖరారు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై అప్పుడే 1 మిలియన్ మార్కుని కూడా అందుకుంది. త్వరలోనే ఐమాక్స్ షోస్ కి సంబంధించిన బుకింగ్స్ కూడా మొదలు కాబోతున్నాయి. ఇకపోతే రీసెంట్ గానే విడుదల్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము.
యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ ట్రైలర్ కి ఇప్పటి వరకు 54 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. అదే విధంగా హిందీ వెర్షన్ ట్రైలర్ కి 15 మిలియన్ వ్యూస్, తమిళ వెర్షన్ ట్రైలర్ కి 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక కన్నడ, మలయాళం వెర్షన్ ట్రైలర్స్ కి కలిపి రెండు లక్షల వ్యూస్ రాగా, మొత్తం మీద 5 ప్రాంతీయ భాషలకు కలిపి 82 మిలియన్ వ్యూస్ యూట్యూబ్ ద్వారా వచ్చాయి. ఇక ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, షేర్ చాట్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలకు కలుపుకొని మొత్తం మీద 200 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయని, ఇది టాలీవుడ్ లోనే సరికొత్త సంచలన రికార్డు అని అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఈ ట్రైలర్ తర్వాత సినిమా మీద అంచనాలు మామూలు రేంజ్ లో పెరగలేదు. అప్పటి వరకు ఆసక్తి చూపని కొంతమంది ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చూసేందుకు ఇప్పుడు అమితాసక్తిని చూపిస్తున్నారు.
ట్రైలర్ లో శంకర్ మార్క్ కనిపించడంతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ఆకట్టుకునే విధంగా స్టోరీ, కంటెంట్ ఉంది అని అర్థం అవ్వడంతో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. నార్త్ అమెరికా లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే 1 మిలియన్ కి పైగా ప్రీ సేల్స్ జరుగుతాయని అంచనా వేస్తున్నారు. లండన్, ఆస్ట్రేలియా, గల్ఫ్, నార్వే, అరబ్ దేశాల్లో కూడా ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ భారీగానే జరుగుతున్నాయి. అన్ని దేశాలకు కలిపి ప్రస్తుతానికి 1 మిలియన్ డాలర్లు వచ్చింది. అంటే 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు అన్నమాట. ఫైనల్ ప్రీ సేల్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. కాసేపట్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి లో జరగబోతుంది. ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నట్టు సమాచారం.