https://oktelugu.com/

Allu Arjun : అల్ట్రా స్టైలిష్ లుక్ లోకి వచ్చేసిన అల్లు అర్జున్..సంబరాల్లో అభిమానులు..వైరల్ అవుతున్న లేటెస్ట్ లుక్ వీడియో!

గత ఐదేళ్లుగా అల్లు అర్జున్ తన పూర్తి సమయాన్ని పుష్ప సిరీస్ కోసమే కేటాయించిన సంగతి తెలిసందే. అదే లుక్ లో ఆయన్ని చూసి అందరికీ బోర్ కొట్టేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : January 4, 2025 / 05:37 PM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : గత ఐదేళ్లుగా అల్లు అర్జున్ తన పూర్తి సమయాన్ని పుష్ప సిరీస్ కోసమే కేటాయించిన సంగతి తెలిసందే. అదే లుక్ లో ఆయన్ని చూసి అందరికీ బోర్ కొట్టేసింది. ఇక అల్లు అర్జున్ పుష్ప లుక్ నుండి బయటకి రాడా?, ఇంకెన్ని రోజులు ఇదే లుక్ లో చూడాలి? అంటూ అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి తోడు రీసెంట్ గా ఆయన త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా సుకుమార్ తో ‘పుష్ప 3’ ని ప్రారంభించబోతున్నాడు అంటూ వార్తలు ప్రచారం అవ్వడంతో అభిమానులు ఇక ఈ పుష్ప నుండి విముక్తి ఎప్పుడు కలుగుతుంది అంటూ సోషల్ మీడియా లో ఫన్నీ కామెంట్స్ కూడా చేసారు. కానీ అల్లు అర్జున్ లేటెస్ట్ లుక్ ని చూసిన తర్వాత అభిమానులు కూల్ అయిపోయారు. ఒకప్పుడు అల్లు అర్జున్ వింటేజ్ స్టైలిష్ లుక్స్ లో ఎలా కనిపించేవాడో, ప్రస్తుతం అలాంటి అల్ట్రా స్టైలిష్ లుక్ లోకి వచ్చేసాడు.

    షార్ట్ జుట్టు తో, స్టైలిష్ గడ్డం తో ఆయన తన ఇంటి నుండి బయటకి వెళ్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ లుక్ కి సంబంధించిన వీడియో ని అప్లోడ్ చేస్తూ అభిమానులు మళ్ళీ వింటేజ్ స్టైలిష్ స్టార్ వచ్చేసాడు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఆ షూటింగ్ కి సంబంధించి లుక్ టెస్ట్స్ కూడా రీసెంట్ గానే జరిగినట్టు తెలుస్తుంది. 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుందని, మహాభారతం లోని ఒక అంకం ని తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే చిత్రం కూడా లాక్ అయ్యినట్టు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. ‘దేవర’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న కొరటాల శివ తో ఆయన తదుపరి చిత్రం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ‘దేవర’ కి ముందే ఈ ప్రాజెక్ట్ ఖరారు అయ్యింది, కానీ అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తో బిజీ గా ఉండడం వల్ల కొరటాల శివ ఆచార్య, దేవర చిత్రాలు పూర్తి చేసాడు. ఏడాది లోపు త్రివిక్రమ్ సినిమాని పూర్తి చేసి, ఆ తర్వాత కొరటాల శివ సినిమాకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన అట్లీ తో ఒక సినిమా, సందీప్ వంగ తో మరో సినిమా చేయబోతున్నాడు. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో అభిమానులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయబోతున్నాడు అల్లు అర్జున్.