Bhagavath Kesari: ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య బాబు చేస్తున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఈ చిత్రం లో బాలయ్య బాబు కూతురిగా నటిస్తుంది.
ఇప్పటికే 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య మరో హిట్ కొట్టబోతున్న కల ఈ టీజర్ లో స్పష్టం గా కనిపించింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్ అప్పుడే పూర్తి అయ్యిందట.
అమెజాన్ ప్రైమ్ సంస్థ, ఈ ఓటీటీ డీల్ ని రీసెంట్ గానే కుదరించుకున్నట్టు తెలుస్తుంది. బాలయ్య కెరీర్ లోనే 18 కోట్ల రూపాయలకు పైగా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన ఏకైక మొట్టమొదటి సినిమా ఇదేనట. గతం లో ‘వీర సింహా రెడ్డి’ చిత్రాన్ని డిస్నీ + హాట్ స్టార్ సంస్థ 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. వాళ్లకు ఈ సినిమా బాగా గిట్టుబాటు అయ్యింది,అందుకే ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని కూడా భారీ రేట్ కి కొనుగోలు చేసినట్టు గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.
ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చేసుకునే రైట్స్ ఉందట. ఒకవేళ సినిమా ఫలితం తారుమారైన కూడా నాలుగు వారాల తర్వాతే ఓటీటీ లో అప్లోడ్ చేయాలట. ఆ షరత్తు మీదనే మేకర్స్ ఒప్పందం కుదిరించుకున్నట్టుగా తెలుస్తుంది.ఇది ఇలా ఉండగా ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలతో వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకున్న బాలయ్య , ఇప్పుడు భగవంత్ కేసరి తో హ్యాట్రిక్ కొడుతాడో లేదో చూడాలి.