PKSDT Pre Release Business: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్న సినిమా #PKSDT. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ అందించాడు. జులై 28 వ తేదీ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.ఇంకా ఒక పాట మరియు ఫైట్ సన్నివేశం బ్యాలన్స్ ఉంది.ఈ సన్నివేశాలను ఈ నెలలోనే పూర్తి చెయ్యబోతున్నారు
టైటిల్ కూడా మరికొద్ది రోజుల్లోనే ప్రకటించబోతున్నారట. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది. అదేమిటో ఒకసారి గమనిస్తే, ఈ చిత్రానికి అప్పుడే రెండు రాష్ట్రాల్లో ఉన్న బయ్యర్స్ నుండి క్రేజీ ఆఫర్స్ అందుతున్నాయట.
ఇంకా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ కూడా విడుదల కానీ సినిమాకి ఈ రేంజ్ డిమాండ్ రావడాన్ని చూసి ట్రేడ్ పండితులు సైతం షాక్ కి గురి అవుతున్నారు. వాళ్లకి తెలిసిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్నీ ప్రాంతాలకు కలిపి దాదాపుగా 120 కోట్ల రూపాయలకు అడుగుతున్నారట.అయితే సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదల చెయ్యలేదు కాబట్టి, నిర్మాతలు అప్పుడే బిజినెస్ క్లోజ్ చెయ్యడానికి ఇష్టపడడం లేదట.
ఎందుకంటే ఆ ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత బిజినెస్ మరింత పెరిగే అవకాశం కూడా ఉందని నిర్మాతల అభిప్రాయం.ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర అభిమానులను ఉర్రూతలు ఊగించే విధంగా ఉండబోతుందని , పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఒక పండగ లాగా ఉండబోతుందని టాక్, చూడాలి మరి.