https://oktelugu.com/

OTT releases this week: ఓటీటీ లవర్స్ పండగ చేసుకోండి.. ఈ వారం మొత్తం 18 సినిమాలు!

ఈ వారం ఓటీటీలో వస్తున్న చిత్రాలను పరిశీలిస్తే... ఆవేశం వంటి క్రేజీ మూవీ ఉంది. పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 10, 2024 / 02:41 PM IST

    OTT releases this week

    Follow us on

    OTT releases this week: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే. ఏకంగా 18 సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో అత్యంత ఆదరణ పొందిన కొన్ని హిట్ చిత్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ ఉంది. థియేటర్స్ లోకి చెప్పుకోదగ్గ చిత్రాలు రావడం లేదు. ఈ లోటును ఓటీటీ సంస్థలు తీరుస్తున్నాయి. భారత్ లో 20 కి పైగా పేరున్న ఓటీటీ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ శుక్రవారం రాగానే కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్లలతో ప్రేక్షకులకు నాన్ స్టాప్ వినోదం పంచుతున్నాయి.

    మరి ఈ వారం ఓటీటీలో వస్తున్న చిత్రాలను పరిశీలిస్తే… ఆవేశం వంటి క్రేజీ మూవీ ఉంది. పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ నటించిన ఆవేశం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళంలో ఆవేశం భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ ఒక భిన్నమైన రోల్ చేశాడు.

    అలాగే సయామీ ఖేర్ఇ నటించిన హిందీ చిత్రం 8AM మెట్రో సైతం స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. వివాహితకు ఓ కుర్రాడికి మధ్య ఏర్పడిన బంధాన్ని ఈ చిత్రంలో చెప్పారు. 8AM మెట్రో జీ 5లో స్ట్రీమ్ అవుతుంది. కాగా వివిధ ఓటీటీ సంస్థల్లో స్ట్రీమ్ అవుతున్న సినిమాలు సిరీస్లు ఏమిటో చూద్దాం…

    అమెజాన్ ప్రైమ్
    ఆవేశం – మలయాళ చిత్రం
    ది గోట్ – సిరీస్
    మ్యాక్స్ టన్ హాల్ -సిరీస్

    నెట్ఫ్లిక్స్
    లివింగ్ విత్ లియో పార్డ్స్
    బ్లడ్ ఆఫ్ జీనియస్ సీజన్ 2- సిరీస్
    కుకింగ్ ఆఫ్ మర్డర్: అన్ కవరింగ్ ది స్టోరీ సీజర్ రోమన్- డాక్యుమెంటరీ సిరీస్
    ది అల్టిమేటమ్ (సౌత్ ఆఫ్రికా): టెలివిజన్ షో

    జీ 5
    8 AM మెట్రో – హిందీ మూవీ
    పాష్ బాలిష్ – సిరీస్

    సోనీ లివ్
    అన్ దేకీ సీజన్ 3- సీరీస్

    లయన్స్ గేట్ ప్లే
    ది మార్ష్ కింగ్స్ డాటర్ – సినిమా

    జియో సినిమా
    మర్డర్ ఇన్ మహిమా – సిరీస్
    ప్రెట్టీ లిటిల్ లయర్స్: సమ్మర్ స్కూల్

    సన్ నెక్స్ట్
    ఫ్యూచర్ పొందాటి – సినిమా

    హుళు
    బయోస్పియర్

    హోయ్ చోయ్
    చాల్చిత్ర ఏఖాన్