LIK movie 10 days collections: వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నుండి రీసెంట్ గా విడుదలైన ‘LIK ‘ చిత్రం మొదటి రోజు మొదటి ఆట నుండే నెగెటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రదీప్ రంగనాథన్ కి యూత్ ఆడియన్స్ లో ఉన్నటువంటి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ , బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ సినిమా పది రోజుల్లో 90 శాతం రీకవరీ ని అందుకొని సెన్సేషన్ సృష్టించింది. స్టార్ హీరోల సినిమాలు సైతం టాక్ బాగాలేకపోతే డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగులుతున్న రోజులివి. అలాంటిది నిన్న గాక మొన్న వచ్చిన హీరో కూడా అవలీలగా ఫ్లాప్ టాక్ తో బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్తున్నాడంటే , బ్రాండ్ ఇమేజ్ ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు.
పది రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. ఒక్క తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి 29 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉన్నటువంటి సూర్య కి కూడా ఫ్లాప్ టాక్ మీద ఈ రేంజ్ గ్రాస్ రావడం కష్టం. అలాంటిది ప్రదీప్ అలవోకగా ఆ రేంజ్ గ్రాస్ ని రాబట్టడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే. అదే విధంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 10 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక్కడ కూడా యూత్ ఆడియన్స్ లో ప్రదీప్ కి మంచి క్రేజ్ ఉండడంతో ఈ రేంజ్ గ్రాస్ నమోదైంది అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ చిత్రానికి 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 12 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా పది రోజుల్లో ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 58 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 32.5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు భాషలకు కలిపి 40 కోట్ల రూపాయిలు. ఇక కేవలం 8 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే , ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని పూర్తిగా అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది. కానీ అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ఇక్కడ నుండి ఫుల్ రన్ వరకు ఈ చిత్రానికి కేవలం 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే అదనంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి , అంతకు మించి రావడం కష్టమే.