Vijay Devarakonda: ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి అసలు ఏం బాగాలేదు. ఇప్పటికే థియేటర్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. ప్రస్తుతం బుకింగ్స్ కూడా గొప్పగా ఏమి లేవు అని బుక్ మై షో టీమ్ చెబుతుంది. ఈ లెక్కన లైగర్ సినిమాకి భారీగా నష్టాలు రాబోతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ చిత్రం పేరిట మరో చెత్త రికార్డు నమోదు అయ్యింది. ఈ సినిమాకు IMDB 10కి 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇది నిజంగా చాలా దారుణమైన రేటింగ్.

ఈ మధ్య కాలంలో అసలు ఒక సినిమాకి ఇంత దారుణంగా రేటింగ్ రాలేదు. ఇటీవల విడుదలై ఫ్లాప్‌లుగా నిలిచిన చిత్రాలకు కూడా కనీస రేటింగ్ వచ్చాయి. లాల్ సింగ్ చడ్డాకు 5, రక్షా బంధన్ చిత్రానికి 4.6, దొబారాకు 2.9 రేటింగ్ ఇచ్చిన IMDB లైగర్‌కు మాత్రం 1.7 రేటింగే ఇచ్చింది. ఏది ఏమైనా 2022లో ఇప్పటివరకూ విడుదలైన చిత్రాలన్నింటిలోనూ లైగర్ దే తక్కువ రేటింగ్ కావడం విశేషం.
ముఖ్యంగా లైగర్ సినిమా, స్క్రిప్ట్ విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యింది. మెయిన్ గా పూరి పై భారీగా నెగిటివ్ టాక్ నడుస్తోంది. పూరి పాత కాలపు ఆలోచనలను వదులుకోలేక పోతున్నాడు అని సోషల్ మీడియాలో పూరిను బాగా ట్రోల్ చేస్తున్నారు. అసలు స్టార్ హీరో విజయ్ దేవరకొండనే హీరోగా పెట్టుకుని పూరి జగన్నాథ్ తన డైరెక్షన్ లో ఇలాంటి చెత్త సినిమా ఎలా తీశాడా అని అందరూ షాక్ అవుతున్నారు.

పాపం విజయ్ దేవరకొండ తన కెరీర్ ను తీసుకెళ్ళి పూరి చేతిలో పెట్టాడు. పూరి మొత్తానికి లైగర్ అంటూ భారీ డిజాస్టర్ ఇచ్చాడు. విజయ్ కి తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల్లో ఉన్న ఫుల్ పాపులారిటీ ఇప్పుడు పల్చన పడింది. అతనికి వచ్చిన స్టార్ డమ్ ఒక్క సినిమాతో పోయింది. నిజానికి మాస్ కి బాస్ అన్నంత పేరున్న విజయ్ దేవరకొండ నుంచి ‘లైగర్’ లాంటి బోరింగ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా వస్తోందని ఎవరూ ఊహించరు.
దీనికి తోడు, స్టార్ డైరెక్టర్ పూరి ఈ సినిమా తీశాడా ? అంటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రిలీజ్ కి ముందు లైగర్ పై భారీ అంచనాలున్నాయి. రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు కూడా తలకిందులు అయ్యాయి. మొత్తానికి ‘లైగర్’ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా ఏం రాలేదు.