Sivatmika Rajashekhar: అలాంటి బట్టలేసుకుని పబ్లిక్ లో తిరిగేస్తున్న స్టార్ కిడ్ శివాత్మిక.. ఇక ఫ్యాన్స్ ఆగుతారా!

Sivatmika Rajashekhar: స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ షార్ట్స్ ధరించి పబ్లిక్ లో చక్కర్లు కొడుతున్నారు. ట్రెండీ వేర్ లో సూపర్ హాట్ గా తయారైన శివాత్మిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఆమె షేర్ చేయగా ఫ్యాన్స్ మతిపోయి కిరాక్ కామెంట్స్ చేస్తున్నారు. ఫైర్ ఎమోజీస్, హార్ట్ సింబల్స్ పోస్ట్ చేస్తున్నారు. తరచుగా శివాత్మిక ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆమెకో ప్రత్యేకత ఉంది. ఎటువంటి మేకప్ లేకుండా బయటకు వచ్చేస్తారు. […]

  • Written By: Neelambaram
  • Published On:
Sivatmika Rajashekhar: అలాంటి బట్టలేసుకుని పబ్లిక్ లో తిరిగేస్తున్న స్టార్ కిడ్ శివాత్మిక.. ఇక ఫ్యాన్స్ ఆగుతారా!

Sivatmika Rajashekhar: స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ షార్ట్స్ ధరించి పబ్లిక్ లో చక్కర్లు కొడుతున్నారు. ట్రెండీ వేర్ లో సూపర్ హాట్ గా తయారైన శివాత్మిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఆమె షేర్ చేయగా ఫ్యాన్స్ మతిపోయి కిరాక్ కామెంట్స్ చేస్తున్నారు. ఫైర్ ఎమోజీస్, హార్ట్ సింబల్స్ పోస్ట్ చేస్తున్నారు. తరచుగా శివాత్మిక ఇలాంటి సాహసాలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆమెకో ప్రత్యేకత ఉంది. ఎటువంటి మేకప్ లేకుండా బయటకు వచ్చేస్తారు. ఆ ఫోటోలు ఏమాత్రం సంకోచించకుండా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. నిజానికి మేకప్ లేకుండా పబ్లిక్ లో తిరగడానికి హీరోయిన్స్ ఇష్టపడరు. అందులోనూ వర్థమాన హీరోయిన్స్ ఆ సాహసం అసలు చేయరు.

Sivatmika Rajashekhar

Sivatmika Rajashekhar

Also Read: Liger Effect: లైగర్ ఎఫెక్ట్… విజయ్ నువ్వు కొండవి కాదు అనకొండవి నన్ను నాశనం చేశావు… ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు

శివాత్మిక మాత్రం మేకప్ లేకుండా కనిపించడానికి భయపడరు. కాగా శివాత్మిక కెరీర్ మెల్లగా సాగుతుంది. రాజశేఖర్, జీవిత వంటి సీనియర్స్ కూతురు అయినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు తలుపు తట్టడం లేదు. శివాత్మిక పరిశ్రమకు వచ్చి మూడేళ్లు కావస్తుంది. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా దొరసాని తెరకెక్కింది. ట్రాజిక్ ఎండింగ్ కావడం వల్లనేమో కానీ… పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయ్యింది. దొరసాని మూవీతో ఆనంద్ దేవరకొండ పరిశ్రమకు పరిచయమయ్యాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా, శివాత్మిక నటనతో ఆకట్టుకోవడం విశేషం.ప్రస్తుతం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో శివాత్మిక కీలక రోల్ చేస్తున్నారు. అలాగే పంచతంత్రం అనే మూవీలో నటిస్తున్నారు.

Sivatmika Rajashekhar

Sivatmika Rajashekhar

Also Read: Pushpa 2 Shooting: పుష్ప 2′ షూటింగ్ డేట్ ఎప్పుడంటే? షూట్ పూర్తి కాకముందే ఓటీటీ సంస్థలు పోటీ.. ఈ సారి సరికొత్త రికార్డులే!

కనీసం టైర్ టూ హీరోలు కూడా శివాత్మికకు అవకాశాలు ఇవ్వడం లేదు. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో అవకాశాలు దక్కవనడానికి శివాత్మికనే నిదర్శనం. దొరసాని మూవీలో మంచి నటన కనబరిచిన శివాత్మికకు మంచి అవకాశాలు రావాల్సింది. అయితే ఆమె కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా చిత్రీకరణలో ఉన్న సినిమాలు విడుదలైతే కానీ ఓ క్లారిటీ రాదు. మరోవైపు శివాత్మిక అక్క శివాని కూడా ఇలానే స్ట్రగుల్ అవుతున్నారు. మరి ఈ స్టార్ కిడ్స్ శివాని, శివాత్మిక ఈ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.



Read Today's Latest Actress News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube