Justice Uday Umesh Lalit: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేరళకు చెందిన జస్టిస్ యూయూ లలిత్ నియమితులు కానున్నారు. ఆయన పేరును కొలీజియం సిఫారసు చేసింది. 49వ సీజేఐగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. 2021 ఏప్రిల్ లో ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టారు. కీలక తీర్పుల్లో భాగస్వామ్యమయ్యారు. 200 మందికిపైగా జడ్జిలు ఆయన హయాంలో నియమితులయ్యారు. కీలక నిర్ణయాలతో పాటు న్యాయవ్యవస్థలో కీలక సంస్కరణలను అమలుచేశారు. సుమారు 16 నెలల పాటు పదవిలో ఉండగా శుక్రవారం రిటైర్డ్ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా సీజేఐగా లలిత్ ఎంపికయ్యారు. కొలీజియం నిర్ణయించి సిఫారసు చేసింది.

కొత్త సీజేఐ నియామకంపై అభిప్రాయం కోరుతూ జస్టీస్ ఎన్వీ రమణకు కేంద్ర న్యాయ శాఖ లేఖ రాసింది. దీనిపై సమావేశమైన సుప్రీం కోర్టు కొలీజియం ప్రధాన న్యాయమూర్తితో పాటు ఖాళీగా ఉన్న న్యాయమూర్తి పోస్టుల భర్తీపై చర్చించింది.ప్రస్తుతం సుప్రీం కోర్టులో సీనియర్ అయిన యూయూ లలిత్ పేరును సిఫారసు చేసింది. కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలిపి రాష్ట్రపతి సంతకం చేసిన వెంటనే లలిత్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 49వ ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు దక్కించుకోనున్నారు.
జస్టిస్ లలిత్ కుమార్ ది కేరళ. 1957 నవంబరు 9న జన్మించారు. 2014 ఆగస్టు 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేయకుండానే..నేరుగా సుప్రీం కోర్టులో పనిచేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇటువంటి న్యాయమూర్తుల జాబితాలో లలిత్ ఆరోవారు. ట్రిపుల్ తలాక్ విడాకులు రాజ్యాంగ విరుద్ధమని..2017లో మూడింట రెండు వంతు మెజార్టీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ లలిత్ ఒకరు. రాజ్యాంగ ధర్మాసనంలో ఆయన కీలక సభ్యుడు కూడా.

అలాగే కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ తీర్పులో కూడా లలిత్ కీలక భాగస్వామి. ఆలయ నిర్వహణ హక్కు ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి ఉంటుందని సంచలన తీర్పు ఇచ్చినది జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనమే.ఎన్నో సంచలనమైన తీర్పులు ఇచ్చిన ధర్మాసనంలో లలిత్ ఒక న్యాయమూర్తిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి భారత సర్వోన్నత న్యాయస్థానం పీఠాన్ని అధిరోహించనున్నారు. కానీ ఆయన సీజేఐగా కేవలం మూడు నెలల పాటే కొనసాగనున్నారు. ఈ ఏడాది నవంబరు 8న పదవీ విరమణ చేయనున్నారు.