Liger: లాస్​ వెగాస్​లో చిల్​ అవుతున్న లైగర్​ టీమ్.. నెట్టింట్లో పిక్స్ వైరల్​!

Liger: పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టి.. అర్జున్​ రెడ్డి సినిమాతో సూపర్​ హిట్​ కొట్టిన హీరో విజయ్​ దేవరకొండ.. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకపోయినా.. కష్టపడి స్టార్​ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్​. ఆతర్వాత కూడా విభిన్న కథాంశంతో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. ముందుకు దూసుకెళ్లిపోతున్నాడు.  ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్​ పూరిజగన్నాథ్​ విజయ్​ హీరోగా ఓ సినిమా తరకెక్కుతోంది. ఈ సినిమాకు లైగర్​ అనే టైటిల్​ ప్రకటించారు. ఇందులో బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే […]

Written By: Raghava Rao Gara, Updated On : November 14, 2021 12:05 pm
Follow us on

Liger: పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టి.. అర్జున్​ రెడ్డి సినిమాతో సూపర్​ హిట్​ కొట్టిన హీరో విజయ్​ దేవరకొండ.. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకపోయినా.. కష్టపడి స్టార్​ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్​. ఆతర్వాత కూడా విభిన్న కథాంశంతో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. ముందుకు దూసుకెళ్లిపోతున్నాడు.  ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్​ పూరిజగన్నాథ్​ విజయ్​ హీరోగా ఓ సినిమా తరకెక్కుతోంది. ఈ సినిమాకు లైగర్​ అనే టైటిల్​ ప్రకటించారు. ఇందులో బాలీవుడ్​ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్​గా నటిస్తోంది.

https://twitter.com/Charmmeofficial/status/1459434251019960324?s=20

తాజాగా, లైగర్​ టీమ్​ షూటింగ్​ కోసం యూఎస్​ వెళ్లిన సంగతితెలిసిందే. వీలైనంత త్వరగా షూటింగ్​ పూర్తి చేసి రిలీజ్​ చేసేందుకు చూస్తున్నాడు పూరి జగన్నాథ్​. కాగా, హీరో విజయ్​ దేవరకొండతో కలిసి పూరి  లాస్​వెగాస్​లో చిల్​ అవుతున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి. పూరి విజ్​ కలిసి ఓ క్యాసినోలో ఎంజాయ్​ చేస్తున్న ఫొటోలు ఛార్మి పోస్ట్​ చేసింది. కొత్త షెడ్యూల్​ స్టార్​కు ముందు అబ్బాయిలు చిల్​ అవుతున్నారు అంటూ క్యాప్షన్​ ఇచ్చింది.

మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కుతోన్న సినిమా లైగర్​. యూఎస్​ షెడ్యూల్​లో అంతర్జాతీయ బాక్సర్​ మైక్​ టైసన్​ పాల్గొననున్నారు. ఈ ఎపిసోడ్​లు సినిమాకు ప్రధాన హైలెట్​గా నిలుస్తాయని తెలుస్తోంది. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.