https://oktelugu.com/

Trivikram Marriege : అక్క కోసం వెళ్లి చెల్లిని.. త్రివిక్రమ్ పెళ్లి విషయంలో షాకింగ్ ఘటన..: సంవత్సరం ఎందుకాగాడు?

Trivikram Marriege : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ సినిమాలంటే ఇష్టపడని వారుండరు. సినిమా ఎలా ఉన్నా మాటలతో మాయ చేసే సామర్థ్యం త్రివిక్రమ్ సొంతం.  త్రివిక్రమ్ ఖాతాలో దాదాపు విజయం సాధించిన సినిమాలే ఎక్కువ. మాటల రచయితగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఆ తరువాత డైరెక్టర్ గా మారాడు. అతడు, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ లో అగ్ర దర్శకుల సరసన చేరాడు. ఒకప్పుడు హీరోల […]

Written By: , Updated On : November 14, 2021 / 12:03 PM IST
Follow us on

Trivikram Marriege : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ సినిమాలంటే ఇష్టపడని వారుండరు. సినిమా ఎలా ఉన్నా మాటలతో మాయ చేసే సామర్థ్యం త్రివిక్రమ్ సొంతం.  త్రివిక్రమ్ ఖాతాలో దాదాపు విజయం సాధించిన సినిమాలే ఎక్కువ. మాటల రచయితగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఆ తరువాత డైరెక్టర్ గా మారాడు. అతడు, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టాలీవుడ్ లో అగ్ర దర్శకుల సరసన చేరాడు. ఒకప్పుడు హీరోల వెంట తిరిగిన తివ్రిక్రమ్.. ఇప్పడు త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించేందుకు కొందరు హీరోలు క్యూ కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో త్రివిక్రమ్ పర్సనల్ లైఫ్ గురించి ఓ విషయం  హాట్ టాపిక్ గా  మారింది. ఆయన పెళ్లి చేసుకునే సమయంలో జరిగిన సంఘటన గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: Trivikram Srinivas: త్రివిక్రమ్ ను వదిలేలా లేడు.. పవన్ నిర్ణయం ఇది !

trivikram

trivikram

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. కొంతకాలంగా ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయనకు సాహిత్యంపై ఇష్టం ఏర్పడింది. దీంతో సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కలిగింది. ఆ ఆసక్తితో పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. ఈ సమయంలో ప్రముఖ కమెడియన్ సునీల్ తో కలిసి ఒకే రూంలో ఉన్నాడు. 1999లో స్వయవరం సినిమాకు మాటలు రాశారు. ఆ తరువాత నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశాడు.

trivikram srinivas and family

trivikram srinivas and family

త్రివిక్రమ్ మాటలు రాసిన సినిమాలన్నీ దాదాపు  విజయవంతం అయినవే. ఫ్లాప్ అయిన   సినిమాల్లో కూడా ఎక్కువగా పంచ్ డైలాగులు ఉండడంతో అందరి దృష్టి మాటల రచయితపై ఫోకస్ పడింది. దీంతో నువ్వు నాకునచ్చావ్ సినిమా సమయంలో త్రివిక్రమ్ పేరు బయటకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావడానికి త్రివిక్రమ్ మాటలే కారణమని కొందరు ఇప్పటికీ అంటారు. ఈ ఊపులో తివ్రిక్రమ్ తరుణ్ తో కలిసి ‘నువ్వే నువ్వే’ సినిమా తీశారు. మొదటి సారిగా డైరెక్షన్ చేసిన ఈ సినిమా సక్సెస్ కావడంతో త్రివిక్రమ్ లో హోప్ పెరిగింది. అయితే ఆ తరువాత మరో సినిమా తీయడానికి మూడేళ్ల సమయం పట్టింది.

Trivikram Wife

Trivikram Wife

ఆ తరువాత వెంటనే స్టార్ హీరో మహేశ్ బాబుతో కలిసి ‘అతడు’ తీశారు. ఈ సినిమా ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టరయ్యింది. దీంతో అటు మహేశ్ బాబు కెరీర్ మలుపు తిప్పగా.. ఇటు త్రివిక్రమ్ కు మంచి పేరు వచ్చింది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్న త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ తో కలిసి ‘జల్సా’ తీశారు. ఆ తరువాత ఖలేజా, అత్తారింటికి దారేది సినిమాలు తీసి సక్సెస్ సాధించారు. అయితే త్రివిక్రమ్ సినిమాలంటే కేవలం కామెడీ ఉంటుందని అనుకున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ‘అరవింద సమేత వీర రాఘవ’ అనే మాస్ సినిమా తీసి ఆకట్టుకున్నాడు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ క్రమంలో తివ్రిక్రమ్ పర్సనల్ విషయంపై ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన పెళ్లి విచిత్రంగా సాగిందని త్రివిక్రమ్ ఓ సందర్భంలో చెప్పారు. త్రివిక్రమ్ భార్య పేరు సౌజన్య. ఈమె ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మేన కోడలు. అయితే సౌజన్య వాళ్ల అక్కను పెళ్లి చేసుకోవడానికి వెళ్లాడు త్రివిక్రమ్. కానీ సౌజన్య నచ్చింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. అయితే ఆమె అక్కకు పెళ్లి చేసేవరకు ఆగాలని చెప్పారు. దీంతో సంవత్సరం పాటు ఆమె పెళ్లి అయ్యే వరకు త్రివిక్రమ్ వెయిట్ చేశారు. ఆ తరువాత 2002లో చెల్లి సౌజన్యను పెళ్లి చేసుకొని త్రివిక్రమ్ సెటిల్ అయ్యారు.