https://oktelugu.com/

Tollywood : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లక్ష్మి… ప్రస్తుతం హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన బ్యూటీ..

యూత్ అండ్ ఫ్యామిలీ సినిమాలకు శేఖర్ కమ్ముల కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. ఈయన ఎంచుకునే కథలు రోజువారి జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయని చెప్పొచ్చు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 7, 2025 / 03:40 PM IST

    Life is Beautiful Lakshmi

    Follow us on

    Tollywood :  టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేసి శేఖర్ కమ్ముల సూపర్ హిట్స్ అందుకున్నారు. యూత్ అండ్ ఫ్యామిలీ సినిమాలకు శేఖర్ కమ్ముల కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. ఈయన ఎంచుకునే కథలు రోజువారి జీవితాలకు చాలా దగ్గరగా ఉంటాయని చెప్పొచ్చు. మన చుట్టుపక్కల జరిగే సన్నివేశాలను ఆధారంగా చేసుకుని శేఖర్ కమ్ముల సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ఇక ఆ సినిమాలలో ఉండే హీరో, హీరోయిన్లు కూడా మన మధ్యన తిరిగే సాధారణ అమ్మాయిలా ఉండేలాగా దర్శకుడు శేఖర్ కమ్ముల చూసుకుంటారు. ఆనంద్ సినిమా నుంచి మొన్న వచ్చిన లవ్ స్టోరీ సినిమా వరకు ప్రతి సినిమా కూడా అంతే. ఇక ఈయన దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కూడా అంతే మన మధ్య జరిగే కొన్ని అందమైన ప్రేమ కథలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమాలలో నటించినా అభిజీత్, సుధాకర్, శగున్ కౌర్, జారా సాస్ అందరికీ గుర్తుండే ఉంటారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత ఈ హీరోలు ఒకటి రెండు సినిమాలలో కనిపించారు. కానీ ఈ సినిమా హీరోయిన్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు అని చెప్పొచ్చు.

    ఇక ఈ సినిమాలో హీరో సుధాకర్ కు జంటగా నటించిన అమ్మాయి లక్ష్మి అలియాస్ జారా సాస్ ఈ సినిమా తర్వాత మరొక సినిమాలో కనిపించలేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఈమె ఒక అమాయకపు అమ్మాయిలాగా చాలా చక్కగా నటించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తర్వాత జారా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే గుర్తుపట్టడం కష్టమే.

    శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఎంతో చక్కగా లంగా వోని లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ బయట మాత్రం చాలా హాట్ అని చెప్పడంలో సందేహం లేదు. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఈ అమ్మడు మారిపోయింది. తాజాగా ఈమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

    ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఇంతలా మారిపోయింది ఏంటి అంటూ అవ్వకవుతున్నారు.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తెలుగింటి అమ్మాయిలాగా లంగా వోని లో కనిపించిన లక్ష్మీ బయట ఏంటి ఇంతలా మారిపోయింది అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.

    Life is Beautiful Lakshmi