
డేర్ అండ్ డాషింగ్ అనే పదానికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ‘మోడ్రన్ ఋషి’గా పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా ఆద్భుతంగానే ఉంటుంది. ఇక ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ మనకు తెలియని ఎన్నో విషయాలను విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా పూరి నుండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. టాపిక్ పేరు ‘లివింగ్ డేంజరస్‌లీ’.
ఈ టాపిక్ ద్వారా జీవితంలో మనిషి ఎలా ఉండాలో పూరి చాల క్లారిటీగా చెప్పుకొచ్చాడు. ‘లివింగ్ డేంజరస్‌లీ ఇస్ ది ఓన్లీ వే అని నీషో చెప్పాడని, అలాగే ఓషో కూడా ఇదే చెప్పాడని.. ఎవ్వరూ రిస్క్ లేని జీవితాన్ని కోరుకోవద్దు అని పూరి చెప్పుకొచ్చాడు. అసలు సెక్యూరిటీ ఇమ్మని లైఫ్ ను అడగొద్దు. జీవితం అనే కొవ్వొత్తిని రెండు వైపులా వెలిగించి చూద్దాం.
అసలు కొవ్వొత్తి అటు నుంచే ఎందుకు కాలాలి? ఇటు నుంచి ఎందుకు కాలకూడదు ? అనే నైజం మనలో ఉండాలి. అప్పుడే స్కై డైవింగ్ భయమైతే అదే చేసి చూడండి. సడెన్ గా సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసి ట్రావెల్‌కి బయలుదేరండి. ముఖ్యంగా బడ్జెట్ ట్రావెల్ చేసి చూడండి. చాల విషయాలు తెలుస్తాయి. తక్కువ డబ్బుతో ఎలా బతకాలో నేర్చుకుంటారు.
జరిగిపోయిన గతం మనకెందుకు? ఇప్పుడు ఈ క్షణం మాత్రమే మనది. మీకు ఇష్టమైనది చెయ్. ఏమి చేసినా ఇష్టంగా చెయ్. ఇష్టం లేకపోతే వదిలేయ్. ఏదైతే అదైంది అనుకో. రేపు చనిపోతున్నాం అనుకుని ఈ రోజు బతుకు. జీవితాన్ని ఎప్పుడూ దూరం నుంచి చూస్తే అర్ధం కాదు. దగ్గర నుండి చూస్తే భయం. భయం ఓ దెయ్యం. ఆ దెయ్యం చెప్పినట్లు వింటే ఇక అంతే. అందుకే నీకెవ్వరూ లేరనుకొని బతుకు. అనాథవనుకో. అప్పుడేం చేస్తావో ఆలోచించి చెయ్. జీవితం అంటేనే రిస్క్. బ్రతికితే డేంజరస్ గానే బ్రతకాలి’ అంటూ పూరి చెప్పుకొచ్చాడు.