https://oktelugu.com/

సోనూ సూద్ సాయం నుంచి గుణపాఠాలివీ

సోనూ సూద్.. ఈ బాలీవుడ్ నటుడి గురించి తెలుగులోనూ పరిచయం అక్కర్లేదు. ‘ వదలా బొమ్మాళీ’ అంటూ అరుంధతి సినిమాలో భీకర విలనిజాన్ని పండించారు. అయితే సినిమాల్లో విలన్ అయిన ఈ నటుడు .. నిజజీవితంలో మాత్రం అసలు సిసలు హీరో అనిపించుకుంటున్నాడు. Also Read: రాజమౌళి- మహేష్ సినిమా పై స్పష్టత ! బాలీవుడ్, టాలీవుడ్ తారలు కూడా చేయలేని ఎన్నో పనులను సోనూ సూద్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. కరోనా సంక్షోభ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 27, 2020 / 08:30 PM IST
    Follow us on


    సోనూ సూద్.. ఈ బాలీవుడ్ నటుడి గురించి తెలుగులోనూ పరిచయం అక్కర్లేదు. ‘ వదలా బొమ్మాళీ’ అంటూ అరుంధతి సినిమాలో భీకర విలనిజాన్ని పండించారు. అయితే సినిమాల్లో విలన్ అయిన ఈ నటుడు .. నిజజీవితంలో మాత్రం అసలు సిసలు హీరో అనిపించుకుంటున్నాడు.

    Also Read: రాజమౌళి- మహేష్ సినిమా పై స్పష్టత !

    బాలీవుడ్, టాలీవుడ్ తారలు కూడా చేయలేని ఎన్నో పనులను సోనూ సూద్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. కరోనా సంక్షోభ సమయంలో నటుడు సోను సూద్ నిస్వార్థంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు. వేలాది మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరుకోవడానికి సహాయం చేశాడు. లాక్డౌన్ కాలంలో ముంబై నగరంలో చాలా మంది పేదలకు ఆహారం అందించాడు. ఆరోగ్య సిబ్బంది కోసం హోటల్, భోజనం సమకూర్చాడు.విదేశాల్లోని వారిని ప్రత్యేక విమానాలు వేయించి రప్పించాడు. లాక్డౌన్ పరిమితులు సడలించిన తర్వాత కూడా అతను మంచి పనిని కొనసాగిస్తున్నాడు.

    చిత్తూరు జిల్లాలో ఓ రైతు నాగేశ్వరరావు దుస్థితిని ఎవరో వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టారు. కూతుళ్లను కాడెద్దులుగా మార్చి నాగలి దున్నుతున్న నాగేశ్వరరావు వీడియోను ట్విట్టర్ లో పెట్టారు. అది వైరల్ అయ్యింది. సోనూసూద్ చలించి గంటల్లోనే నాగేశ్వరరావు కుటుంబానికి ట్రాక్టర్ ను అందించాడు. ఎక్కడో ముంబైలో ఉన్నా కూడా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉన్న ఓ రైతుకు ట్రాక్టర్ ను అందించాడు. ఈ ట్రాక్టర్ పొందడానికి ఈ రైతు కుటుంబం అర్హులే’ అంటూ పేర్కొన్నాడు. రూ.6 లక్షల విలువైన ట్రాక్టర్ ను అందజేశారు..

    *ఏపీలో చాలా సబ్సిడీ కార్యక్రమాలు..
    ఇక్కడే మన ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం చాలా సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టింది. చేతికి ఎముకే లేకుండా జగన్ ప్రభుత్వం వేలకు వేలు అకౌంట్లలో వేస్తోంది. అలాంటి జగన్ రైతు రాజ్యంలో ఓ రైతు ఇలా కాడెద్దులు కూడా లేకుండా ట్రాక్టర్ తో కూడా దున్నించుకోలేని దుస్థితిలో ఉన్నాడని తేలడం నిజంగా ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో చాలా మంది రైతుల పరిస్థితి ఇలానే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లక పథకాలు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. అంతేకానీ నిజమైన రైతులకు అందడం లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ.

    *అర్హులకు పథకాలు అందుతున్నాయా?
    ఇక మరో విషయం ఏంటంటే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. లబ్ధిదారులకు అందిస్తోంది. మరి ఏపీలో ఇంత మంది కనీస సదుపాయాలు లేని రైతులు ఉంటే ఆ సాయం అంతా ఎటు పోతోంది. ప్రభుత్వం అసలైన నిరుపేద లబ్ధిదారులకే పథకాలు అందిస్తుందా లేదా అన్నది ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఎంతో సాయం చేస్తున్నా.. ఇప్పటికీ సంక్షేమ పథకాల కోసం కలెక్టరేట్లకు లబ్ధిదారులు వస్తున్న పరిస్థితి నెలకొంది.

    *ఇక ప్రజలూ మారాలి.
    ఇక ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తున్నాయి కదా అని తీసుకుంటూ పోతే ప్రజలు కూడా సోమరులుగా మారుతారు. అందుకే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఉచిత పథకాల కంటే స్వావలంభన సాధించే దిశగా సాగితే వాళ్లు బాగుపడుతారు. ఇక ప్రభుత్వాలు కూడా ప్రజలకు స్వయం ఉపాధి చూపించే పథకాలనే అమలు చేస్తే వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా మారుతారు.

    *సోషల్ మీడియాను మిస్ యూజ్ చేయవద్దు
    ఇక సోషల్ మీడియా వచ్చాక ఏది వాస్తవం ఏదీ కాదనేది తెలియకుండా ఉంది. చిత్తూరు జిల్లాలో తన కూతుళ్లను కాడెద్దులుగా మార్చి దున్నిన రైతుకు నటుడు సోనూ సూద్ ఓ ట్రాక్టర్ ను కొనిచ్చాడు. అందరూ అతడిని ప్రశంసించారు. కానీ ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ప్రభుత్వం ఆదేశానుసారం.. ఎంపీడీఓ ఆ ఊరుకి వెళ్ళి విచారించగా అది వాళ్ళు సరదాగా చేసిన వ్యవహారమని వెలుగు చూసింది. ఈలోపు సోనూ సూద్ సాయంత్రానికి ట్రాక్టర్ పంపించాడు. ఈ మొత్తం వ్యవహారం జాతీయ మీడియాలో వచ్చింది. మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే.. సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజాలు కానక్కర్లేదు. మనం నిర్ధారించుకోవాల్సిందేనని చాటి చెబుతోంది.

    Also Read: బాలయ్య పైత్యం.. కొత్త హీరోయిన్ ఇక పాతదే !

    *ఇక రాజకీయ నాయకులు ప్రతి పరిస్థితిని క్యాష్ చేసుకోవద్దు..
    సోనూసూద్ దయాగుణం చూసి చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ అందివచ్చిన అవకాశాన్ని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు నాయుడు కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడం విశేషం. ట్రాక్టర్ అందించిన సోనూ సూద్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు.. ఈ ఇద్దరు ఆడబిడ్డలను తాను చదివిస్తానని అభయమిచ్చాడు. సోను సూద్‌ను ఫోన్ చేసి మరీ ప్రశంసించారు. ఇద్దరూ ఇదే విషయాన్ని ట్వీట్ లో వెల్లడించారు. సోనూ సూద్ సాయాన్ని చంద్రబాబు బాగా క్యాష్ చేసుకున్నట్టు అర్థమవుతోంది. ఏపి ప్రభుత్వం పేదలకు, అర్హులకు మంచి చేయదని దేశానికి చూపించాలన్నది బాబు ఆలోచనగా ఈ వ్యవహారంలో కనిపిస్తున్నది. ఆ ఇద్దరు అమ్మాయిలకు విద్యను అందిస్తానని ప్రకటించడం కూడా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు వేసిన బాంబ్ గా అభివర్ణిస్తున్నారు. సాయం మాటున చంద్రబాబు చేసిన రాజకీయం.. అలాగే దేశవ్యాప్తంగా వారి పట్ల సానుభూతి కూడా అవగాహన లోపంతో లభించేదేనని అర్థమవుతోంది. ఈ క్రమంలో రైతుకు సహాయం చేయడం లేదని ఏపీ ప్రభుత్వంపై మాత్రం మచ్చ పడింది.

    కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని సెలెబ్రెటీలు ముందు వెనుకా ఆలోచించకుండా ఉదారంగా సాయం చేయవద్దు.. సాయం చేయడం మంచిదే అయినా నిర్ధారించుకోవడం మంచిది. లేదంటే ఇలా వృథాగా మారిపోతుంది. చాలా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అర్హులకు అందిస్తే ఇలాంటి అసమానతలు తొలుగుతాయి. అర్హత లేని వ్యక్తులకు కూడా ప్రయోజనం కలిగించకుండా అర్హులకు లభిస్తే వారి జీవితాలను బాగు చేసిన వారు అవుతారు. రాజకీయ నేతల దోపిడీకి గురికాకుండా ఉంటారు..

    -నరేశ్ ఎన్నం