Homeఎంటర్టైన్మెంట్Leo Movie: గడ్డ కట్టే చలిలో.. విజయ్ తళపతి అండ్ టీం కష్టాలివీ

Leo Movie: గడ్డ కట్టే చలిలో.. విజయ్ తళపతి అండ్ టీం కష్టాలివీ

Leo Movie
Leo Movie

Leo Movie: విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో చిత్రం రూపొందుతోంది.. అంతకుముందు లోకేష్ తీసిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ లో లలిత్ కుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు..లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రూ పొందుతోందని తెలుస్తోంది.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఒక ప్రమోషనల్ సాంగ్ యూ ట్యూబ్ లో రికార్డులు షేక్ చేసింది.. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా వేగంగా జరుగుతున్నది.

మొదటి షెడ్యూల్ చిత్రీకరణ నిమిత్తం చిత్ర యూనిట్ కాశ్మీర్ వెళ్ళింది..విజయ్, త్రిష పలువురు అక్కడ చిత్రీకరణలో పాల్గొంటున్నారు.. దాదాపు షెడ్యూల్ కూడా పూర్తి కావచ్చింది. అయితే చిత్రీకరణ సమయంలో తాము ఎంత ఇబ్బంది పడుతున్నామనేది చిత్ర యూనిట్ ఒక వీడియో రూపంలో యూట్యూబ్లో విడుదల చేసింది. -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో చిత్ర యూనిట్ చిత్రీకరణ జరుపుతోంది. ” చేతులు వణికి పోతున్నాయి.. రక్తం గడ్డ కడుతుందేమోనని భయం వేస్తోంది.. అడుగు వేయాలంటే నరకం కనిపిస్తోంది.. ఇక ఉదయం పూట అయితే ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాత్రి సమయంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము షూటింగ్ చేస్తున్నాం” అని చిత్ర యూనిట్ లో పనిచేసే టెక్నికల్ బృందం లోని సభ్యులు పేర్కొన్నారు.

Leo Movie
Leo Movie

కాశ్మీర్ లో అక్కడి లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం షూటింగ్ లకు అనుమతులు ఇచ్చింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత పర్యటకాన్ని ఆకర్షించేందుకు భారీ ఎత్తున నజరానాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లింది.. మరోవైపు లియో సినిమా లో చాలా బాగా కాశ్మీర్ నేపథ్యంలో సాగుతుంది. అంతకు ముందు విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో సాంగ్ లో ఈ చిత్ర హీరో విజయ్ చాక్లెట్ డ్రగ్ తయారు చేసే వ్యక్తిగా కనిపించాడు.. అతని కోసం పోలీసులు వెతుకుతున్నట్టు.. వీడియోలో కనిపించింది.. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ అక్కడ కీలకమైన షెడ్యూల్ షూటింగ్ చేస్తోంది.

ఈ షూటింగు భారీ ఎత్తున తమిళ నటీనటులను కాశ్మీర్ తీసుకెళ్లారు. అక్కడ అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేస్తున్నారు. ఇంతవరకు ఎవరూ చూపించని లోకేషన్లను ఈ చిత్ర డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మనోజ్ పరమహంస చూపిస్తున్నారు.. ఇక ఈ చిత్ర యూనిట్ అక్కడి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.. అ పోలీసులను విజయ్ అభినందిస్తున్నట్టు వీడియోలో కనిపించింది.. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్ గా నిలుస్తోంది.

 

The Crew Behind #LEO | Thalapathy Vijay | Lokesh Kanagaraj | Anirudh Ravichander

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version