Homeఎంటర్టైన్మెంట్LEO - Glimpse of Harold Das : విక్రమ్ రిపీట్ : అర్జున్...

LEO – Glimpse of Harold Das : విక్రమ్ రిపీట్ : అర్జున్ పాత్రను లీక్ చేసిన ‘లియో’ టీం

LEO – Glimpse of Harold Das : విక్రమ్‌ సూపర్‌ హిట్‌ తర్వాత కోలీవుడ్‌ మోస్ట్‌ వాంటెండ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వ వహిస్తున్న చిత్రం పేరు లియో.. ఇదయ దళపతి విజయ్‌, త్రిష, సంజయ్‌ దత్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌.. ఇలా భారీ తారాగణంతో ఈ సినిమా రూపుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడులైన పాట వందలకొద్దీ మిలియన్‌ వ్యూస్‌ దక్కించుకుంది. బ్లడ్‌ స్వీట్‌ పేరుతో రూపొందించిన లిరికల్‌ సాంగ్‌ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించి పాత్రలను లోకేష్‌ కనగరాజ్‌ రివిలీ చేశాడు.

ఆ మధ్య సంజయ్‌ దత్‌ జన్మదినం సందర్భంగా ఆయన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆంటోని దాస్‌ పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తున్నాడు. డ్రగ్స్‌ ను డీల్‌ చేసే వ్యాపారిగా ఆయన పాత్ర ఉంటుందని లోకేష్‌ కనకగరాజ్‌ చెప్పకనే చెప్పేశాడు. ఇక ఈరోజు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ జన్మదినోత్సవం సందర్భంగా లియో చిత్ర యూనిట్‌ ఆ పాత్ర తీరూ తెన్నుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు హరోల్డ్‌ దాస్‌ అని తెలుస్తోంది. 30 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో అర్జున్‌ రగ్గ్‌డ్‌ లుక్‌ లో కనిపిస్తున్నాడు. చుట్టూ ఆయన గ్యాంగ్‌ లో పని చేసే రౌడీల మధ్య ఓ వ్యక్తిని కొడుతున్నట్టు కన్పించాడు. దీనికి తోడు అనిరుధ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ తర్వాత స్థాయిలో అన్నట్టుగా ఉంది.

సంజయ్‌ దత్‌ పాత్ర పేరు ఆంటోనీ దాస్‌ అని పరిచయం చేసిన సంజయ్‌ దత్‌.. అర్జున్‌ పాత్ర పేరు హారోల్డ్‌ దాస్‌ అని వీడియోలో చెప్పేశాడు. అంటే ఈ సినిమాలో వీరిద్దరూ అన్నదమ్ములు అని తెలుస్తోంది. పైగా డ్రగ్స్‌ వ్యాపారాన్ని లీడ్‌ చేసే వారిగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఆంటోనీ దాస్‌ పాత్రను పరిచయం చేసినప్పుడు ఉన్న వాతావరణం, హారోల్డ్‌ దాస్‌ పాత్రకు సంబంధించి చుట్టూ ఉన్న వాతావరణం ఒకే విధంగా ఉండటం పై వాటికి బలం చేకూర్చుతోంది. పైగా విక్రమ్‌ సినిమాకు కొనసాగింపు అనే విధంగా ఈ సినిమా రూపొందిస్తున్నట్టు కోలివుడ్‌ వర్గాల్లో టాక్‌. ఎందుకంటే ఇప్పటి దాకా విడుదలయిన వీడియోలు, పాటలు విక్రమ్‌ సినిమా వాతావరణాన్నే ప్రతిబింబించాయి. విక్రమ్‌ సినిమాలోనూ డ్రగ్స్‌ చుట్టూ కథ నడిస్తే.. ఇందులనూ డ్రగ్స్‌ తయారు చేసే వ్యక్తిగా విజయ్‌ కన్పించాడు. అందులోని ఓ గ్యాంగ్‌ను లీడ్‌ చేసే వ్యక్తిగా సంజయ్‌దత్‌ పాత్ర ద్వారా లోకేష్‌ చెప్పేశాడు. ఇప్పుడు తాజాగా విడుదలయిన అర్జున్‌ పాత్ర కూడా అదే కోవలో ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular