Bigg Boss Telugu 8: బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ షో బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ స్టార్ మా లో ప్రసారం అవుతుంది. ఇప్పటి వరకు ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ సెప్టెంబర్ 1న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక కంటెస్టెంట్స్ గా సోనియా ఆకుల, నాగ మణికంఠ, నబీల్ అఫ్రిది, బెజవాడ బెబక్క, కిరాక్ సీత, శేఖర్ బాషా, విష్ణుప్రియ, సీరియల్ నటుడు నిఖిల్, యాష్మి గౌడ, విష్ణుప్రియ, నటుడు అభయ్ నవీన్, సీరియల్ నటి ప్రేరణ, నైనిక, పృథ్విరాజ్ కంటెస్టెంట్స్ గా ఎంపిక అయ్యారు.
బిగ్ బాస్ షోకి వెళ్లాలని చాలా మంది ఆశపడుతున్నారు. వారిలో కొందరికే ఛాన్స్ దక్కుతుంది. బిగ్ బాస్ షోకి వెళ్లాలని ఆసక్తి కలిపించే అంశాల్లో ఫేమ్ తో పాటు డబ్బు ఒకటి. తక్కువ సమయంలో లక్షల్లో రెమ్యూనరేషన్ రాబట్టవచ్చు. మరి సీజన్ 8 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ ఏమిటో పరిశీలిద్దాం.. నాగ మణికంఠ రూ. 1.20 లక్షలు వారానికి తీసుకుంటున్నాడట. ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో నాగ మణికంఠ అత్యంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
తెలుగు అమ్మాయి సోనియా ఆకులకు బిగ్ బాస్ నిర్వాహకులు రూ. 1.5 లక్షలు ఇస్తున్నారట. సోషల్ మీడియా స్టార్ విజయవాడ బేబక్కకు రూ.1.5 లక్షలు ఇస్తున్నారట. మరో సోషల్ మీడియా స్టార్ నబీల్ అఫ్రిది వన్ వీక్ రెమ్యూనరేషన్ రూ.2 లక్షలు అట. ఇతడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో అంత ఇస్తున్నారట. యాంకర్ కమ్ ఆర్జే శేఖర్ బాషా బాగానే డిమాండ్ చేశాడని తెలుస్తుంది. శేఖర్ బాషాకు వారానికి రూ. 2.5 లక్షలు ఇస్తున్నారట.
యూట్యూబ్ లో బోల్డ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన కిరాక్ సీత కొన్ని సినిమాల్లో కూడా నటించింది. ఆమె రెమ్యూనరేషన్ రూ. 2 లక్షలు అట. సీరియల్ నటుడు నిఖిల్ కి వారానికి రూ.2.25 లక్షలు ఇస్తున్నారట. నటుడు ఆదిత్య ఓంకి బిగ్ బాస్ మేకర్స్ మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. ఆయనకు వారానికి రూ.3 లక్షలు అట. సీరియల్ నటి యాష్మి గౌడ రూ. 2.5 లక్షలు తీసుకుంటున్నారట. మరో సీరియల్ నటి ప్రేరణకు వారానికి రూ. 2 లక్షలు ఇస్తున్నారట.
నటుడు అభయ్ నవీన్ రూ.2 లక్షలు, పృథ్విరాజ్ రూ.1.5 లక్షలు, నైనిక రూ.2.2 లక్షలు వారానికి తీసుకుంటున్నారట. ఇక ఈ సీజన్ హైయెస్ట్ రెమ్యూనేషన్ తీసుకుంటున్న సెలబ్రిటీ విష్ణుప్రియ అట. ఆమెకు భారీగా ఫేమ్ ఉన్న నేపథ్యంలో రూ.4 లక్షలు వారానికి ఇస్తున్నారట.
Web Title: Leaked bigg boss 8 telugu contestant remunerations
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com