Pushpa 2: సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2… ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా హిందీ జనాల్లో మాత్రం ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే పుష్ప సినిమా తెలుగులో కంటే హిందీలోనే బాగా ఆడింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు కూడా ఓవర్ నైట్ లో పాన్ ఇండియా లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంత ఇంత కాదు. నార్మల్ జనాల నుంచి సినిమా స్టార్లు, క్రికెటర్లు అందరూ ‘పుష్ప తగ్గేదేలే’ అంటూ రీల్స్ చేస్తు యూ ట్యూబ్ ను షేక్ చేశారు. అంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిన పుష్ప సినిమా కి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మీద భారీ అంచనాలు ఉండడం సహజం…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమాలో పుష్ప రాజ్ ను కేశవ దొంగ దెబ్బ తీయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనివల్ల పుష్ప క్లైమాక్స్ లో చనిపోబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
పుష్ప రాజ్ ఈ సినిమాలో చనిపోతాడా లేదా అనే విషయాల మీద క్లారిటీ అయితే లేదు కానీ, ఈ సినిమా నుంచి వస్తున్న లీకేజీ ప్రకారం ఈ న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా ఒక ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన ఒక ప్రోగ్రామ్ లో ‘జనాలు ఏ సినిమా రిలీజ్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అంటూ అడిగిన ప్రశ్న కి చాలా మంది పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నాం అని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా మీద పెరిగిన అంచనాలను రీచ్ అవ్వాలంటే సుకుమార్ పుష్పని మరో రేంజ్ లో తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో…