https://oktelugu.com/

Anil Ravipudi: చిరంజీవి కాదంటే అనిల్ రావిపూడి వెంకటేష్ దగ్గరికి వచ్చాడా..?

ఒక్కో క్యారెక్టర్ కి సపరేట్ గా ఒక్కో మ్యానరిజాన్ని సెట్ చేసుకుంటూ కామెడీని పండిస్తాడు. ఒకప్పుడు 'జంధ్యాల' ఏ విధంగా అయితే కామెడీ క్యారెక్టర్లు సృష్టించి వాటి ద్వారా ఫన్ జనరేట్ చేసేవాడో సరిగ్గా అదే విధానాన్ని అనిల్ రావిపూడి అనుసరిస్తూ ఉంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 4, 2024 8:28 am
    Pushpa 2

    Pushpa 2

    Follow us on

    Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన చేసిన ఏడు సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాయి. ఇక ఈయన సినిమాల్లో కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి.సినిమాలోని క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని ఆయన రాసుకునే కామెడీ విపరీతమైన ఆదరణను పొందింది.

    అందుకే ఒక్కో క్యారెక్టర్ కి సపరేట్ గా ఒక్కో మ్యానరిజాన్ని సెట్ చేసుకుంటూ కామెడీని పండిస్తాడు. ఒకప్పుడు ‘జంధ్యాల’ ఏ విధంగా అయితే కామెడీ క్యారెక్టర్లు సృష్టించి వాటి ద్వారా ఫన్ జనరేట్ చేసేవాడో సరిగ్గా అదే విధానాన్ని అనిల్ రావిపూడి అనుసరిస్తూ ఉంటాడు. అందుకే అనిల్ ని జూనియర్ జంధ్యాల అంటూ మరి కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఈయన దర్శకత్వంలో నటించడానికి ప్రతి హీరో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు.

    ఇక అందులో భాగంగానే రీసెంట్ గా బాలయ్య తో భగవంత్ కేసరి సినిమా చేసి సక్సెస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత చిరంజీవితో ఒక సినిమా ఉంటుందంటూ చాలా వార్తలైతే వచ్చాయి. నిజానికి అనిల్ రావిపూడి కూడా చిరంజీవికి ఒక కథ చెప్పాడు. అది చిరంజీవి కి కూడా బాగా నచ్చింది తను కూడా చేయాలని అనుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ కాంబినేషన్ అనేది సెట్ అవ్వలేదు. ఇక దాంతో అదే స్క్రిప్ట్ తో వెంకటేష్ ని హీరోగా పెట్టీ అనిల్ రావిపూడి సినిమాని స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

    ఇక ఈ విషయం తెలిసిన వెంకటేష్ అభిమానులు చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో వెంకటేష్ తో సినిమా చేస్తున్నావా అనిల్ అంటూ సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ స్టోరీ చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీయేనా లేదంటే వెంకటేష్ కోసం రాసుకున్న మరొక స్టోరీనా అనేది తెలియాలంటే ఈ విషయం మీద అనిల్ రావిపూడి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది…