Lavanya Tripathi- Varun Tej: సినిమా ఇండస్ట్రీలో ఉన్న మెగా ప్రిన్స్ అయిన వరుణ్ తేజ్ యంగ్ హీరోలలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న విషయం కూడా మనకు తెలిసిందే. రీసెంట్ గానే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయింది ఇక దాంతో అప్పటినుంచి ఈ జంట ప్రతి సారీ వార్తల్లో నిలుస్తూనే వస్తున్నారు.ఇప్పటికే వరుణ్ తేజ్ తన ఫ్రెండ్స్ కి బ్యాచ్ లర్ పార్టీ ఇచ్చి వార్తల్లో నిలువగా లావణ్య త్రిపాఠి కూడా తరచుగా వాళ్ళ పెళ్లి పనులకు సంబంధించిన వార్తల్లో నిలుస్తుంది. ఇక రీసెంట్ గా నిన్న ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ మెగా ఫ్యామిలీ లోని అందరితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ముఖ్యంగా చిరంజీవి సురేఖ దంపతులతో వీళ్ళిద్దరూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఇక ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వీళ్ళ పెళ్లి కి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది.
అయితే వీళ్ళ పెళ్లి నవంబర్ 1 వ తేదీన ఇటలీలోని టూష్కానీ లో జరగనున్నట్టుగా తెలుస్తుంది. కాగా పెళ్లికి సంబంధించిన షాపింగ్ ని కూడా ఇద్దరు రీసెంట్ గానే పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన పనుల్లో రెండు ఫ్యామిలీలు కూడా చాలా బిజీగా ఉన్నాయి. ఇక నవంబర్ 1 వ తేదీన వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి సమయంలో వరుణ్ తేజ్ కూడా సినిమాలకి చాలా రోజుల నుంచి బ్రేక్ ఇచ్చి పెళ్లికి సంబంధించిన పనుల్లో పూర్తిగా నిమగ్నమై పెళ్లి తర్వాత తీసుకున్న కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత సినిమాలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల ప్రేమ వ్యవహారం పెళ్లిదాకా రావడంతో మెగా ఫ్యామిలీతో పాటు చాలామంది సినీ అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ఇండస్ట్రీ లో అందరూ ప్రేమించుకుంటారు. కానీ ఆ ప్రేమని పెళ్లి దాకా తీసుకెళ్లిన వాళ్ళకి సమాజంలో ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నప్పటికీ పెళ్లిళ్లు మాత్రం వేరే వాళ్ళని చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ప్రేమ పెళ్లిళ్లు అనేవి జరగడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే హీరో హీరోయిన్ ప్రేమించుకున్నప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల మధ్యలోనే బ్రేకప్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఇలా ప్రేమని సక్సెస్ ఫుల్ గా పెళ్లి వరకు తీసుకొచ్చుకున్నందుకు వీళ్ళ జంటను చూసి అందరూ కంగ్రాట్స్ కూడా చెప్తున్నారు…