https://oktelugu.com/

Lavanya Tripathi: ఏడాది తిరగకుండానే గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి..!

కొన్నేళ్ల పాటు సీక్రెట్ గా ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్, లావణ్య గత ఏడాది ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఇటలీలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 21, 2024 / 04:51 PM IST

    Lavanya Tripathi going to be a mother

    Follow us on

    Lavanya Tripathi: హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. కాగా 2017లో మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ సినిమాలో నటించింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. మరోసారి అంతరిక్షం మూవీ కోసం వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా సెట్స్ లోనే వారి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిందని సమాచారం.

    కొన్నేళ్ల పాటు సీక్రెట్ గా ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్, లావణ్య గత ఏడాది ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఇటలీలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి తన యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేస్తుంది. చాలా సెలెక్టివ్ సినిమాలు చేస్తుంది. ఇటీవల మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా ప్రకటించలేదు.

    ఈ ఖాళీ సమయంలో మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా లావణ్య త్రిపాఠి గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తల్లి కాబోతుందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారట. వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నారు టాలీవుడ్ వర్గాల టాక్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది.

    ఓ బాబుని ఎత్తుకుని ఉన్న ఫోటో ఆమె రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె తల్లి కాబోతున్న విషయం ఇలా ఇన్ డైరెక్ట్ గా చెప్పిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ విషయం పై మెగా కోడలు స్పందించలేదు. ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. 2023 నవంబర్ 5న లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ ల వివాహం జరిగింది. ఈ వివాహానికి మెగా హీరోలు అందరూ హాజరయ్యారు.