Lavanya-Raj Tarun controversy:గత ఏడాది నుండి రాజ్ తరుణ్(Raj Tarun),లావణ్య(Lavanya) వ్యవహారం మీడియా లో ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెద్ద పెద్ద చానెల్స్ ప్రైమ్ టైం లో ఈ అంశం పై డిబేట్స్ జరుపుతూ ఉండేవి. అమ్మాయి కాబట్టి మొదట్లో అందరూ లావణ్య కి సపోర్ట్ గా ఉండేవాళ్ళు. ఆమె పై జాలి చూపేవాళ్లు. కానీ ఆ తర్వాత ఆమె అసలు రూపం తెలిసిన తర్వాత ఆమెని ద్వేషించడం మొదలు పెట్టారు. ఏ ఉద్దేశ్యం తో రాజ్ తరుణ్ ని ఇబ్బంది పెట్టాలని మీడియా ముందుకొచ్చిందో అందరూ పసిగట్టారు. అప్పటి నుండి రాజ్ తరుణ్ పై నెటిజెన్స్ లో పాజిటివిటీ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. అయితే మస్తాన్ సాయి వ్యవహారం వైపు మళ్ళీ ద్రుష్టి మరలించేలా చేసి రాజ్ తరుణ్ కి క్షమాపణలు చెప్పింది లావణ్య. అయితే రీసెంట్ గానే రాజ్ తరుణ్ తల్లితండ్రులు తమ ఇల్లు వెనక్కి ఇచ్చేయాలని లావణ్య ఇంటి ముందు ధర్నా కి దిగిన సంగతి అందరికీ తెలిసిందే.
Also Read: నా మీద పగ తీర్చుకోవడం కోసమే నా వీడియోలు విడుదల చేశారు..దయచేసి నమ్మకండి – లావణ్య
అప్పుడు లావణ్య మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆ తర్వాత వ్యవహారం ఎటు వెళ్లిందో తెలియదు కానీ, కాసేపటి క్రితమే లావణ్య కు సంబంధించిన ఒక వీడియో, కొన్ని ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. వీటిని చూస్తే మీకు ఈ అమ్మాయిని చూస్తే భయం వేయక తప్పదు. చేతిలో ఎదో కవర్ పట్టుకొని చూపిస్తుంది. అందులో మాలిక ద్రవ్యాలు ఉన్నాయో ఏమిటో అర్థం కావడం లేదు. ఆ తర్వాత ఫోన్ కాల్ రికార్డింగ్ లో ఎదో పెద్ద డీలింగ్ గురించి మాట్లాడుతుంది. అదేంటో మీరే ఈ క్రింది వీడియో లో చూసి తెలుసుకోండి. ఇంటి కి వచ్చేయండి రా, ఇక్కడ ఎవ్వరూ లేరు, మనం పని కానిద్దాం అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ సంచలనంగా మారాయి.
Also Read: సంజయ్ దత్ ను బయటపెట్టిన ప్రభాస్… ఆయనతో మామూలుగా ఉండదు…
అయినా రాజ్ తరుణ్ తో ప్రేమలో ఉండగా, ఇంత మంది అబ్బాయిలతో ఈ విధంగా మాట్లాడడం ఏమిటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి కొంతమంది అయితే అసలు ఆ అమ్మాయిని ఎలా భరించావ్ బాబు అన్ని రోజులు అని రాజ్ తరుణ్ ని ట్యాగ్ చేసి దండం పెడుతున్నారు. అయితే లావణ్య తనకు సంబంధించిన ఏ చిన్న విషయం చెడుగా వచ్చిన మీడియా ముందుకొచ్చి మాట్లాడడం ఇది వరకు చాలా సార్లు చూసాము. మరి ఈరోజు ఆమె వీడియోలకు బయటకు వచ్చి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూద్దామని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారం మళ్ళీ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
మళ్లీ తెరపైకి లావణ్య వ్యవహారం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు, వీడియోలు
వీడియోలో ఓ ప్యాకెట్ చూపిస్తూ బుక్‌లో పెట్టిన లావణ్య.
కళ్లద్దాల బాక్స్‌లో పెట్టమంటూ చెబుతున్నట్లున్న మరో ఆడియో.
లావణ్య డ్రగ్స్ దందా చేస్తున్నట్లు ఆరోపణలు. pic.twitter.com/NO5ZCXjA6c— ChotaNews App (@ChotaNewsApp) July 10, 2025