Lavanya vs Raj Tarun: గత కొంతకాలం గా రాజ్ తరుణ్(Raj Tarun) , లావణ్య(Lavanya) వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతూ వస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. లావణ్య మొదట్లో రాజ్ తరుణ్ పై కేసు పెట్టినప్పుడు ఆమెకు మంచి సపోర్ట్ ఉండేది. కానీ ఎప్పుడైతే శేఖర్ బాషా అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడో, అప్పటి నుండి కథ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఆయన లావణ్య అసలు రంగుని బయటపెట్టడం తో ఒక్కసారిగా రాజ్ తరుణ్ కి సపోర్ట్ విపరీతంగా పెరిగిపోయింది. లావణ్య కావాలనే రాజ్ తరుణ్ ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అని అత్యధిక శాతం మంది నమ్మడం మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకు లావణ్య కనిపించకుండా పోయింది, మళ్ళీ ఆమె మస్తాన్ సాయి అనే వ్యక్తిని ఇరికించింది, రాజ్ తరుణ్ కి క్షమాపణలు కూడా చెప్పింది. రీసెంట్ గా రాజ్ తరుణ్ తల్లితండ్రులు తమ ఇంటిని తిరిగి ఇచెయ్యని లావణ్య ఇంటి ముందు బైఠాయించడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
Also Read: సంజయ్ దత్ ను బయటపెట్టిన ప్రభాస్… ఆయనతో మామూలుగా ఉండదు…
అప్పుడు మళ్ళీ ఆమె రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేసింది. చివరికి ఆ గొడవ ఎక్కడి వరకు వెళ్లి ఆగిందో ఎవరికీ తెలియదు. అయితే నేడు లావణ్య కి సంబంధించిన కొన్ని వీడియోలు, ఆడియో రికార్డ్స్ సోషల్ మీడియా లో విడుదల అయ్యాయి. వాటిలో ఆమె మాలాకద్రవ్యాల వినియోగం గురించి పలువురు పురుషులతో ఫోన్ కాల్ మాట్లాడుతుండడం సంచలనం గా మారింది. ఈ అమ్మాయి చాలా డేంజర్ లాగా ఉందిగా అని ఈ ఆడియో రికార్డు ని విన్న ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనపై వచ్చే ఆరోపణలకు కచ్చితంగా సమాధానం ఇచ్చే మనస్తత్వం ఉన్న లావణ్య, ఈ సంఘటన పై కూడా సమాధానం ఇస్తుందని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే కాసేపటి క్రితమే ఆమె ఒక వివరణ ఇస్తూ వీడియో చేసింది.
Also Read: ఆ విషయంలో ప్రభాస్ అంత ఎమోషనల్ అయ్యాడు ఏంటి..? వైరల్ వీడియో…
ఇందులో ఆమె మాట్లాడుతూ ‘నావి కొన్ని ఆడియోలు,వీడియోలు ఈరోజు సోషల్ మీడియా లో లీక్ అవ్వడం నా దృష్టికి వచ్చాయి. నేను మస్తాన్ సాయి పైనా హార్డ్ డిస్క్ గురించి కంప్లైంట్ పెట్టడం జరిగింది. అదే హార్డ్ డిస్క్ లో ఉన్న ఆడియోస్, వీడియోస్ ని ఇప్పుడు కుట్ర చేస్తూ, ఉద్దేశపూర్వకంగా, నా మీ ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇలాంటివి రిలీజ్ చేస్తున్నారు. నేను బాగానే ఉన్నాను అండీ. నేను అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. ఇవన్నీ దయచేసి నమ్మకండి’ అంటూ లావణ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే లావణ్య పై నెటిజెన్స్ ఎలాంటి సానుభూతి చూపించడం లేదు. ఆమె ఏమి మాట్లాడినా పట్టించుకోవడం మానేస్తున్నారు. మరి ఈ వ్యవహారం పై ఇంకా ఆమె ఏమి మాట్లాడుతుందో, ఏ మీడియా మెట్లు ఎక్కుతుందో చూడాలి.
వీడియో విడుదల చేసిన లావణ్య
తాజాగా వైరల్ అవుతున్న ఆడియోలు, వీడియోలు మస్తాన్ సాయి హార్డ్డిస్క్లోని పాత వీడియోలు అని తెలిపిన లావణ్య
తనపై రివేంజ్ తీర్చుకోవడం కోసమే ఇప్పుడు బయటపెడుతున్నారని వెల్లడి
ఆ వీడియోలపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చిన లావణ్య
ఆ వీడియోలతో… https://t.co/vwyVJySmqR pic.twitter.com/v8Cc7MTLf6
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2025